భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది. ఒకసారి ఏడుఅడగులు నడిచారంటే.. వారితోనే కలకాలం కలిసి ఉండాలి. అందుకే భార్యాభర్తలు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. వాటిని తొందరగా మర్చిపోయి అన్యోన్యంగా ఉండాలంటారు పెద్దలు. అలాగే భార్యాభర్తల మధ్య దాపరికాలు, మొహమాటాలు, సీక్రేట్స్ అసలే ఉండకూడదంటారు. కానీ వారి మధ్యన ఎంత ప్రేమున్నా భార్యాభర్తలు కొన్ని విషయాలను ఒకరితో ఒకరు అస్సలు చెప్పుకోరు. ఇవి ఎప్పటికీ సీక్రేట్స్ గానే మెయింటైన్ చేస్తారు. ఎట్టిపరిస్థితిలో షేర్ చేసుకోరు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
డబ్బుకు సంబంధించిన విషయాలు
ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా డబ్బును తక్కువగా సంపాదించే వారు.. వారి సంపాదన గురించి లేదా చేసే పని, తమ నైపుణ్యాల గురించి అస్సలు చెప్పుకోరు. ఎందుకంటే ఈ విషయాన్ని చెబితే ఎక్కడ అవతలి వ్యక్తి చులకనగా చూస్తారేమోనని భయపడతారు. అందుకే డబ్బుకు సంబంధించిన విషయాల గురించి స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు చెప్పుకోరు.
గత సంబంధాలు
చాలా మంది పెళ్లి కాకముందు రిలేషన్ షిప్ లో ఉంటాయి. ఇది సక్సెస్ అయితే పర్లేదు.. కానీ సక్సెస్ కాకపోతే.. పెళ్లి చేసుకున్న వారితో వారి గత సంబంధాల గురించి అస్సలు చెప్పుకోరు. దీనివల్ల చేసుకున్న వారు అపార్థం చేసుకుంటారని లేదా వదిలివెళ్లిపోతారేమోననే భయం ఉంటుంది. మరికొంతమందికి వారి గురించి మాట్లాడే ఇంట్రస్టే ఉండదు. ముఖ్యంగా ఆ రిలేషన్ షిప్ బాధను కలిగిస్తే..
డబ్బు సమస్యలు
చాలా వరకు పురుషులు డబ్బుకు సంబంధించిన సమస్యలను అస్సలు షేర్ చేసుకోరు. ముఖ్యంగా భార్యతో. ఎందుకంటే డబ్బు సమస్యలు బాగా ఒత్తిడిని కలిగిస్తాయి. జనాలు తమ ఆర్థిక ఇబ్బందు గురించి ఇతరులకు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
కుటుంబ సమస్యలు
కుటుంబ సంతోషంగా ఉండే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పలేం. అప్పుడప్పుడు సమస్యలు కూడా వస్తాయి. ఇవి ఒత్తిడిని కలిగిస్తాయి. అయితే చాలా మంది కుటుంబ సమస్యలను భాగస్వామికి చెప్పకుండా ఉంటారు. ఇది భారం మోపడం ఇష్టంలేకే కుటుంబ సమస్యలను దాచిపెడతారు.
కొన్ని విషయాలను..
ఎంత ప్రేమగా, అన్యోన్యంగా ఉన్న జంటలైనా సరే కొన్ని విషయాలను మాత్రం సీక్రేట్స్ గానే ఉంచుతారు. ఎందుకంటే వీళ్లు ఒకరు చెప్పిన దానికి మరొకరు ఏకీభవించరు. ఇది ఇద్దరి మధ్య గొడవలకు దారితీస్తుంది. అందుకే ఇలాంటి విషయాలను ఒకరితో ఒకరు అస్సలు చెప్పుకోరు.
కలలు, లక్ష్యాలు
చాలా మంది తమ భాగస్వామితో తమకున్న లక్ష్యాలను లేదా కలలను అస్సలు షేర్ చేసుకోరు. ఎందుకంటే తమ భాగస్వామి అందుకు అంగీకరించదు లేదా.. అది నెరవేరకపోతే బాధపడతారని ఆందోళన చెంది ఒకరితో ఒకరు చెప్పుకోకుండా ఉంటారు.
Are you single- If you get rid of some habits
సోషల్ మీడియా జెలసీ
చాలా మందికి సోషల్ మీడియాను రోజూ చూసే అలవాటు ఉంటుంది. దీనిలో అన్యోన్యంగా ఉండే జంటలను చూసి .. వారితో తమను పోల్చుకుంటారు. అయితే ఎవ్వరైనా సరే ఆన్ లైన్ లో తమ భాగస్వామి ఉనికిని చూసి అసూయపడతారు. అలాగే దానికి అస్సలు ఒప్పుకోరు.
సీక్రేట్స్ సోషల్ మీడియా
చాలా మంది తమ భాగస్వామికి తెలియకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ను మేనేజ్ చేస్తుంటారు. తమ భాగస్వామి గుర్తుపట్టకుండా.. లేదా తమ భాగస్వామికి తెలియకుండా దాచి ఉంచే వేరే సోషల్ మీడియా ప్రొఫైల్ లేదా గేమింగ్ అవతార్ వంటి సీక్రేట్ ఆన్‌లైన్ గుర్తింపులను కలిగి ఉంటారు. వీటిని భాగస్వామికి అస్సలు చెప్పరు.
మాజీ గురించి..
నేటి కాలంలో రిలేషన్ షిప్స్ మూనాళ్ల ముచ్చటగానే ఉంటున్నాయి. వెంటనే రిలేషన్ షిప్ లో పడటం, తొందరగా దానికి బ్రేకప్ చెప్పడం కామన్ అయిపోయింది. అయితే ఎవరైన కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టగానే.. తమ మాజీ గురించి మర్చిపోలేని ఎన్నో విషయాలు, వారితో చెప్పాల్సిన ఎన్నో మాటలు ఉంటాయి. అయినా సరే.. వాటి గురించి మాత్రం ప్రస్తుత భాగస్వామితో అస్సలు చెప్పుకోరు.
పురుషుల శారీరక అభద్రత
ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శారీరక అభద్రతాభావానికి లోనవుతారు. కానీ ఈ విషయాలను మాత్రం భాగస్వామికి అస్సలు చెప్పుకోరు. ముఖ్యంగా పురుషులు. ఎందుకంటే తమ భాగస్వామితో ఈ అభద్రతాభావాల గురించి మాట్లాడితే వారు వీరిని వదిలేస్తారని భయపడతారు.