బ్యాక్టీరియాతో పోరాడటానికి..
ముద్దు పెట్టుకునేటప్పుడు లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది నోట్లోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాగా ముద్దు ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది
మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. కాగా ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి స్థాయిలు, యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ మెదడు సాధారణంగా ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తి బలోపేతం
గాఢమైన లిప్ కిస్ ను పెట్టుకోవడం వల్ల లాలాజలం ఒకరినుంచి ఒకరికి మార్పిడీ అవుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి సహాయపడే కొత్త సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి వచ్చేలా చేస్తుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2014 అధ్యయనం.. తరచుగా ముద్దు పెట్టుకునే వ్యక్తులు వారి లాలాజలంతో పాటు వారి నాలుకలో ఒకే మైక్రోబయోటాను పంచుకుంటారని కనుగొన్నారు.
జీవక్రియ
ముద్దు కూడా మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఎక్కువసేపు, గట్టిగా ముద్దు పెట్టుకుంటే మీ జీవక్రియ రేటు పెరుగుతుందని నిపుణులు చెబెతున్నారు. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది కూడా.
లైంగిక సంతృప్తి
ఉద్వేగభరితమైన ముద్దులతో కూడిన ఫోర్ ప్లే లేకుండా శృంగారంలో పాల్గొన్న ఆనందాన్ని కలిగిస్తుంది. ముద్దు లైంగిక కోరికలను పెంచడానికి మాత్రమే కాదు ఇది మీకు భావప్రాప్తి కలిగించడానికి కూడా సహాయపడుతుంది.
కేలరీలను బర్న్ చేయడానికి
ది అమెరికాల్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2013 వ్యాసం ప్రకారం.. ఒక సాధారణ ముద్దు కేవలం 2 కండరాలను మాత్రమే ఉపయోగిస్తుంది. అలాగే ఇది రెండు మూడు కేలరీలను మాత్రమే బర్న్ చేస్తుంది. కానీ ఉద్వేగభరితమైన ముద్దులో నిమిషానికి 5 నుంచి 26 కేలరీలు కరుగుతాయి.
ముద్దు పెట్టుకోవడానికి ఈ నోటి పరిశుభ్రత చిట్కాలను ఫాలో అవ్వండి
నోటి పరిశుభ్రత మెరుగ్గా ఉండేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. ముద్దు పెట్టుకునే ముందు మీ నోరు తాజాగా ఉండటానికి మౌత్ వాష్ ఉపయోగించండి.
ఫ్లోసింగ్ కూడా కూడా మీ నోటిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తొలగిస్తుంది. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పళ్లు తోముకున్న తర్వాత నాలుకను శుభ్రం చేయండి. ఎందుకంటే మనం తిన్న ఆహారం నాలుకపై పొరగా ఏర్పడి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను పెంచుతుంది.
పొగాకు ఉత్పత్తులు ఎనామిల్ పై మరకలను ఏర్పడేలా చేస్తుంది. అలాగే నోటి దుర్వాసనను కూడా కలిగిస్తాయి. కాబట్టి వీటిని ఉపయోగించకండి.
హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మీ శ్వాస తాజాగా ఉంటుంది.నోరు పొడిబారితే నోటి దుర్వాసన వస్తుంది.
బ్యాక్టీరియా చక్కెరను తిని నోటి దుర్వాసనకు కారణమవుతుంది. కాబట్టి చక్కెరను తక్కువగా తినండి.