'ఎవర్' లేదా 'నెవర్' అనే పదాన్ని ఉపయోగించడం సరైనది కాదు. ఇది మీరు మాట్లాడుతున్న వ్యక్తి గురించి ప్రతికూల చిత్రాన్ని సృష్టిస్తుంది. విషయం వదిలేసి వ్యక్తిత్వంపై దాడి చేయడం లాంటిది. ఫలానా పరిస్థితి, టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు "మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, మీరు నాకు మద్దతు ఇవ్వలేదు" వంటి పదాలు బాధిస్తాయి.
• పోల్చడం..
కోపంలో చాలా మంది ఇతరులతో పోలుస్తూ ఉంటారు. ఇతరులతో పోల్చడం అనేది చాలా మంది కి నచ్చదు. దీని వల్ల దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ కోపం మీకు తగ్గిపోయినా, వారికి మాత్రం మీరు పోల్చిన పోలిక గుర్తుండిపోతుంది.