భర్తను కాదని ప్రియుడితో వివాహిత అక్రమ సంబంధం, ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య, మరో స్త్రీ మోజులో భర్త ఇలాంటి వార్తలు రోజూ పేపర్లలోనో, టీవీల్లోనో, న్యూస్ వెబ్ సైట్లలోనూ చదువుతూనే ఉంటాం. మనం చూస్తున్నది.. చదువుతున్నది చాలా తక్కువ అని ఓ సర్వేలో తేలింది.
undefined
మనకు తెలీకుండా కొన్ని లక్షల మంది కట్టుకున్న భార్య, భర్తలను కాదని మరోకరితో శృంగారం కోసం వెంపర్లాడుతున్న వారు లక్షల కొద్దీ ఉన్నారని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది.
undefined
ఫ్రెంచ్ ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో 8లక్షల మంది భారతీయులు తమ వివరాలను పొందుపరుచుకోవడం విశేషం. అందులో పెళ్లైనవాళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
undefined
తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం గమనార్హం. ఈ డేటింగ్ యాప్‌లో టెక్ హబ్ బెంగళూర్ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు నమోదయ్యారు.
undefined
తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం గమనార్హం. ఈ డేటింగ్ యాప్‌లో టెక్ హబ్ బెంగళూర్ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు నమోదయ్యారు.
undefined
జనవరి తొలి వారంలో డేటింగ్ యాప్‌కు సబ్‌స్క్రైబర్లు వెల్లువెత్తారు. ఈ ఏడురోజులూ రోజుకు 300 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్ పెరగడం విశేషం. నెలమొత్తంలో వచ్చిన సబ్‌స్క్రిప్షన్ల కంటే తొలి వారంలో వచ్చినవి ఏకంగా 250 శాతం అధికంగా ఉన్నారు.
undefined
నూతన సంవత్సర వేడుకలు ముగిసి దంపతులు తమ పనుల్లో నిమగ్నమవడంతో పాటు పిల్లల వింటర్ వెకేషన్ ముగిసిన క్రమంలో వివాహేతర బంధాల డేటింగ్ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్‌లు వెల్లువెత్తాయని నివేదిక వెల్లడించింది.
undefined
ఈ యాప్‌లో ఎక్కువ మంది బెంగళూర్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, చెన్నై, గుర్‌గావ్, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, లక్నో, కొచ్చి, నోయిడా, వైజాగ్, నాగపూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్ నగరాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.
undefined
ఈ యాప్ వృద్ధి 567 శాతం పైగా ఉండటంతో వివాహ బంధానికి వెలుపల అనైతిక బంధాల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారనేది వెల్లడవుతోందని ఫ్రెంచ్ ఆన్‌లైన్ డేటింగ్ కమ్యూనిటీ వేదిక నివేదిక తెలిపింది.
undefined