భార్యభర్తల బంధం ఒక్కరోజుతో తెగిపోయేది కాదు.. జీవితాంతం కలిసి నడవాల్సిన బంధం. కానీ.. ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు చివరకు విడాకులకు దారితీస్తున్నాయి. అలా కాకుండా.. వారు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలంటే.. ఒకరి కోసం మరొకరు కొంచెం మారడంలో తప్పు లేదు. ముఖ్యంగా భర్త సంతోషంగా ఉంటే.. ఇంట్లో సమస్యలు రావు. మరి.. భర్త సంతోషంగా ఉండాలంటే.. అది భార్య చేతిలోనే ఉంటుంది. మరి.. భార్యలు ఏం చేస్తే.. ఏం చేయకుంటే... భర్తలు ఆనందంగా ఉంటారో తెలుసుకుందాం...
చాలా సందర్భాల్లో, చాలా మంది స్త్రీలు.. చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చూస్తారు. అయితే.. భార్యలు ఇలా చేయడం వల్ల భర్తలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. భార్య ప్రవర్తనకు కూడా చాలా చిరాకు కలిగిస్తూ ఉంటుందట.అలా కనుక స్త్రీ చేయకుంటే.. వారి మధ్య చాలా వరకు సమస్యలు రావట.
ప్రతి భర్త తన భార్య కొన్ని విషయాలను అంత సీరియస్‌గా తీసుకోకూడదని కోరుకుంటాడు. కానీ స్త్రీలు అలా చేయడం కష్టం. ఇది భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. కాబట్టి, భార్యలు చేసే కొన్ని పనులను భర్తలు ఇష్టపడరు. ఆ పనులేంటో తెలుసుకుందాం..
1. ఎక్కువగా ఆలోచించడం: కొంతమంది భార్యలు ఎక్కువగా ఆలోచిస్తారు, భర్తలపై ఆరోపణలు చేస్తారు. భర్త సరైనవాడైనా, భార్య అతను తప్పు అని భావిస్తుంది. అందరి ముందు నిరూపించాలని కూడా చూస్తుంది. ఇది భర్తకు చిరాకు కలిగించడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, భర్త ఏదైనా మర్చిపోతే, భార్య వెంటనే అతన్ని నిందించడం ప్రారంభిస్తుంది. అలా చేయకుండా ఉండాలట.
2. జోకులను సీరియస్‌గా తీసుకోవడం: సాధారణంగా, కొంతమంది స్త్రీలు జోకులు ఇష్టపడరు. వారు దానిని సీరియస్‌గా తీసుకుంటారు, కోపం తెచ్చుకుంటారు. కానీ పురుషులు తమ భార్యలు కూడా జోక్ చేయాలని కోరుకుంటారు. జోక్ లను జోక్ లాగా తీసుకుంటే.. ఇద్దరి మధ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. ప్రేమను ప్రదర్శించడం: కొంతమంది స్త్రీలు తమ భర్తలు అందరి ముందు ప్రేమను ప్రదర్శించాలని కోరుకుంటారు. భర్త అలా చేయకపోతే, వారు దానిని పెద్ద విషయంగా చేసి గొడవ ప్రారంభిస్తారు. ఇది భార్యాభర్తల సంబంధంలో చిచ్చు పెడుతుంది.