భర్త దగ్గర భార్య చెప్పే కామన్ అబద్దాలు ఇవే..!

Published : Dec 06, 2024, 11:43 AM IST

అమ్మాయిలు కామన్ గా చాలా అబద్ధాలు ఆడతారట. అయితే.. పెళ్లి తర్వాత భర్తతో మాత్రం ప్రతి అమ్మాయి కామన్ గా చెప్పే కొన్ని అబద్దాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...    

PREV
18
భర్త దగ్గర భార్య చెప్పే కామన్ అబద్దాలు ఇవే..!

అమ్మాయిలు కామన్ గా తమ ప్రియుడితో లేదంటే.. భర్తతో అబద్దాలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని విషయాలను దాచిపెట్టడం కోసం ఈ అబద్దాలు చెబుతూ ఉంటారట. మరి, వారు చెప్పే అబద్ధాలు ఏంటో చూద్దాం...

 

28
మొదటి అబద్దం..

షాపింగ్‌లో ఎంత ఖర్చు పెట్టామో అమ్మాయిలు ఎవరికీ చెప్పరు. ముఖ్యంగా భర్తలకు ఈ విషయంలో అబద్ధం చెబుతూ ఉంటారు. చెప్పినా తక్కువ లేదా ఎక్కువ ధర చెబుతారు. డబ్బు దాచుకోవడానికి ఈ అబద్ధం చెబుతారు.

38
అబద్ధం 2

అమ్మాయిలు ఎప్పుడూ ఇతరుల కంటే అందంగా కనిపించాలని ఇష్టపడతారు. అందుకే ఎవరి ముందూ, ముఖ్యంగా అబ్బాయిల ముందు తమ బరువు ఎంత ఉందో చెప్పరు. సాధారణ బరువు కంటే తక్కువ చెప్పేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

48
అబద్ధం 3

మగవాడి జీతం, ఆడదాని వయసు అడగకూడదు అనే మాట ఉంది. ఈ మాట ప్రకారం అమ్మాయిలు తమ వయసు, పుట్టిన సంవత్సరం ఏంటో చెప్పరు. దగ్గరి వాళ్ళ దగ్గర కూడా నిజమైన వయసు దాస్తారు.

58
అబద్ధం 4

కొంతమంది అమ్మాయిలు రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతారు. పెళ్లికి ముందు మొదటి ప్రేమ గురించి కూడా ఎవరితోనూ చెప్పుకోరు. కానీ అబ్బాయిలు తమ మొదటి ప్రేమ గురించి ముచ్చటగా చెప్పుకుంటారు.

68
అబద్ధం 5

సరిగ్గా టైం కి వస్తాను అనే అబద్ధం అమ్మాయిలు తరచుగా చెబుతూ ఉంటారు. ఈ విషయంలో అబ్బాయిలు నిజాయితీగా ఉంటారు. సమయం విషయంలో అమ్మాయిలు కొన్ని కారణాల వల్ల ఈ మాట నిలబెట్టుకోలేకపోతారు.

78
అబద్ధం 6

అమ్మాయిలు తాము ఎక్కడున్నామో కరెక్ట్‌గా చెప్పరని అంటారు. ముఖ్యంగా యువతులు తాము ఎక్కడికి వెళ్తున్నామో అనే దాని గురించి చిన్న అబద్ధం చెబుతూ ఉంటారు.

88
అబద్ధం 7

అమ్మాయిలు తమ ఆరోగ్యం గురించి కొంత దాస్తారు. అనారోగ్యంతో ఉన్నా బాగున్నామని అందరికీ చెబుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు తమ భావాలను బయట పెట్టడానికి సంకోచిస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్ ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా రాసింది. దీన్ని  ఏషియా నెట్ తెలుగు ధృవీకరించదు..

Read more Photos on
click me!

Recommended Stories