ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే!

First Published | Oct 17, 2021, 10:17 AM IST

ఒక స్త్రీకి అత్యంత ఆనందాన్ని కలిగించేది తను తల్లి కాబోతున్నదని తెలియడం. ప్రెగ్నెన్సీ (Pregenent) సమయంలో శరీరంలో అనేక మార్పలు ఇబ్బందులను కలిగిస్తాయి. 

ఒక స్త్రీకి అత్యంత ఆనందాన్ని కలిగించేది తను తల్లి కాబోతున్నదని తెలియడం. ప్రెగ్నెన్సీ (Pregenent) సమయంలో శరీరంలో అనేక మార్పలు ఇబ్బందులను కలిగిస్తాయి. మొదటి 3నెలలు కాస్త ఆందోళనగా (Tensions) ఉంటుంది.

గర్భధారణ సమయంలో అందరూ ఒకే లక్షణాలను కలిగి ఉండరు. ప్రతి స్త్రీలో భిన్నమైన ఆరోగ్య లక్షణాలు (Health problems) ఉంటాయి. రుతుక్రమం రాకపోవడం, ఉదయంపూట వాంతులు అవ్వడం, వికారంగా (Awkward) అనిపిస్తుంది.


వాంతులు, వికారంగా ఉండే లక్షణాలు ప్రతి స్త్రీలో ఉండవు. కొందరిలో కళ్ళు తిరగడం, ఏం తిన్న సహించకపోవడం, భయంకరమైన (Terrible) తలనొప్పి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా పిరియడ్ మిస్ అవ్వగానే డాక్టర్ (Doctor) దగ్గరికి వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం అవసరం.

మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వారికి సరైన అవగాహన ఉండదు. గర్భం ధరించిన తర్వాత మొదటి మూడు నెలల్లో గందరగోళం (Confusion), ఆత్రుత (Anxiety) అనిపిస్తుంది. గర్భాధారణ సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో ఏమి తినాలనిపించినా కొన్నిసార్లు ఇష్టమైన పదార్థాల మీద విరక్తి కలుగుతుంది.

గర్భాధారణ సమయంలో బంగాళదుంప, పప్పులు, ఆకుకూరలు, పండ్లు  వంటివి ఆరోగ్యకరమైన ఆహారాలు (Healthy Food). గర్భం ప్రారంభంలో గర్భాశయ ప్రాంతంలో కొంత నొప్పి వస్తుంది. ఇది గర్భాశయ కండరాలు, మలబద్దకానికి (constipation) గురైయనప్పుడు ఇటువంటి నొప్పి తరచూ వస్తే డాక్టర్ ను సంప్రదించాలి. 

ప్రెగ్నెన్సీకి హార్మోన్ టెస్ట్ (Hormone test) చాలా అవసరం. ఈ టెస్ట్ గర్భం ధరించిన 5 లేదా 6వ వారంలో చేయాలి. ఈ టెస్ట్ వల్ల గర్భం ధరించి ఎన్ని రోజులైందో నిర్ధారించవచ్చు. గర్భ నిర్ధారణ జరిగిన తరువాత 7-8 వారాలలో హాస్పిటల్ లో స్కానింగ్ (Scanning) చేయించాలి.

దీనివల్ల గర్భంలో పిండం యొక్క అమరిక, సరైన స్థానంలో ఉన్నదా లేదా అని తెలుపుతుంది. దాంతో పాటు శిశువు యొక్క హార్ట్ బీట్ (Heart beat) తెలుస్తుంది. రక్త పరీక్ష చేయించాలి. గర్భధారణ సమయంలో భయం, ఆందోళన (Tensions) మానసిక రుగ్మతలు ఉంటాయి.

ఇది గర్భధారణ సమయంలో సర్వసాధారణం. మీరు గర్భవతి అని నిర్ధారణ చేసుకున్నాక మీ మనసును ప్రశాంతంగా (Calm down) ఉంచుకోవాలి. మాట్లాడుతూ మెట్లు ఎక్కడం, ఆతృతగా నడవడం వంటి పనులు చేయరాదు. సురక్షితమైన పాదరక్షలను (Safe Footwear) వాడాలి.

Latest Videos

click me!