పెళ్లైన ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. ప్రతి స్త్రీ జీవితంలో తల్లి అవ్వడం అనేది ఓ అపురూప ఘట్టం. తమలోపల మరో ప్రాణికి జీవం పోయడమనేది చాలా అద్భుతమైన విషయం. అందుకే తల్లి అయ్యే ప్రెగ్నెన్సీ కాలాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. కాగా.. మానవ పుట్టుక, చావులలకు జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఉంది అని చాలా మంది నమ్మతారు. వారి నమ్మకం ప్రకారం.. జోతిష్యం మన జీవితాలపై ప్రధాన పాత్ర పోషిస్తుంది.
గ్రహాల కదలికలు, మన నక్షత్రాల అమరికతో పాటు రాబోయే నెలలు మనకు ఏమి ఉంటుందో ఊహించగలరు. అందరు తల్లులు తమ పిల్లలను ఒకేలా ప్రేమిస్తున్నప్పటికీ, కొన్ని రాశిచక్ర కలయికలు అద్భుతంగా ఉంటాయి. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా గర్భం ధరించాలని ఆలోచిస్తుంటే, మీ రాశిచక్రం ప్రకారం గర్భవతి కావడానికి ఉత్తమ సమయం ఏదో మనం ఇప్పుడు చూద్దాం..
1.మేషం..మేషం చాలా తెలివైన రాశిచక్రాలలో ఒకటి . ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించినవారు పిల్లలను ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తారు. ఈ రాశిస్త్రీలు గర్భం ధరించడానికి ఉత్తమ సమయం జూన్ 25 నుండి జూలై 15 వరకు, అక్టోబర్ 25 నుండి నవంబర్ 15 వరకు మరియు ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు ఉంటుంది.
2.వృషభం..ఈ రాశికి చెందిన తల్లలు.. తమ పిల్లలకు మర్యాద, మంచి ప్రవర్తన అలవడేలా చూసుకుంటారు. వాళ్లు కూడా అదే మంచి ప్రవర్తనతో ముందుకు సాగుతుంటారు. కాగా.. ఈ రాశికి చెందిన స్త్రీలు గర్భం ధరించడానికి ఉత్తమ సమయం జూలై 25 నుండి ఆగస్టు 15, నవంబర్ 25-డిసెంబర్ 15, మరియు మార్చి 25 నుండి ఏప్రిల్ 15 వరకు.
3.మిథున రాశి..ఈ రాశివారికి ఎలాంటి ఒత్తిడి పరిస్థితులనైనా సులభంగా అధిగమించగలుగుతారు. పిల్లలను చాలా సులభంగా పెంచేస్తారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ.. వారికి నచ్చే విధంగా ఉంటారు. ఈ రాశికి చెందిన మహిళలు గర్భధారణకు ఉత్తమ సమయం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 15 వరకు, డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు మరియు ఏప్రిల్ 25 నుండి మే 15 వరకు ఉంటుంది.
4.కర్కాట రాశి..ఈ రాశివారు తమ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిత్యం తమ బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా ఉండేందుకు కష్టపడుతుంటారు. కాగా.. ఈ రాశి స్త్రీలు గర్భధారణకు ఉత్తమ సమయం జూలై 25 నుండి ఆగస్టు 15 వరకు, నవంబర్ 25 నుండి డిసెంబర్ 15 వరకు మరియు మార్చి 25 నుండి ఏప్రిల్ 15 వరకు ఉంటుంది..
5.సింహ రాశి..ఈ రాశివారు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశి మహిళలు చాలా శక్తి వంతులు కూడా. మాతృత్వంతోపాటు.. అటు కెరిర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం చాలా కష్టపడతారు. ఈ రాశి స్త్రీల గర్భధారణకు ఉత్తమ సమయం జూన్ 25 నుండి జూలై 15 వరకు, అక్టోబర్ 25 నుండి నవంబర్ 15 వరకు మరియు ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు.
6.కన్య రాశి..ఈ రాశివారు తమ పిల్లలకు క్రమశిక్షణ అలవడేలా చేస్తారు. ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలనే విషయం పిల్లలకు చక్కగా నేర్పిస్తారు. ఈ రాశి స్త్రీలు గర్భం సమయంలో కాస్త ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత పూర్తి శక్తిని పొందగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు గర్భం ధరించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 15 వరకు, జనవరి 25 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు మే 25 నుండి జూన్ 15 వరకు.
7.తుల రాశి..ఈ రాశిచక్రానికి చెందిన స్త్రీలు చాలా వివేకంతో ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు ఉత్తమమైన విలువలను నేర్పించడంలో ముందుంటారు. తుల రాశి మహిళలు గర్భం ధరించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 15 వరకు, జనవరి 25 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు మే 25 నుండి జూన్ 15 వరకు.
8. వృశ్చిక రాశి..ఈ రాశికి చెందిన వారు ప్రతి ఒక్కరినీ తమ హృదయం లోపల నుంచి ప్రేమిస్తారు. అందరినీ ప్రేమగా చూస్తారు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలు గర్భం ధరించడానికి ఉత్తమ సమయం జూన్ 25 నుండి జూలై 15 వరకు, అక్టోబర్ 25 నుండి నవంబర్ 15 వరకు మరియు ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు.
9.ధనస్సు రాశి..ఈ రాశివారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశికి చెందిన తల్లులు సాధారణంగా అన్ని సమయాల్లో చాలా సానుకూలంగా ఉంటారు. ఈ రాశి కి చెందిన స్త్రీలు గర్భధారణకు ఉత్తమ సమయం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 15 వరకు, డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు మరియు ఏప్రిల్ 25 నుండి మే 15 వరకు.
10.మకర రాశి..ఈ రాశివారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. పిల్లల విషయంలోనూ కొంత కఠినంగా వ్యవహరిస్తారు. ఈ రాశి మహిళల గర్భధారణకు ఉత్తమ సమయం జూన్ 25 నుండి జూలై 15 వరకు, అక్టోబర్ 25 నుండి నవంబర్ 15 వరకు మరియు ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు.
11.కుంభరాశి..ఈ రాశివారు తమ పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు. పిల్లల పెంపకంలో చాలా ఉత్తమంగా వ్యవహరిస్తారు. ఈ రాశి మహిళలు గర్భధారణకు ఉత్తమ సమయం జూలై 25 నుండి ఆగస్టు 15 వరకు, నవంబర్ 25 నుండి డిసెంబర్ 15 వరకు మరియు మార్చి 25 నుండి ఏప్రిల్ 15 వరకు.
12. మీన రాశి..ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. పిల్లలతో ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి మహిళలు గర్భధారణకు ఉత్తమ సమయం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 15 వరకు, జనవరి 25 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు మే 25 నుండి జూన్ 15 వరకు.