తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్ గా వస్తాయని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ బిడ్డకు రెండు మూడు నెలల వయస్సు ఉంటే.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకండి. లేదంటే మీ పిల్లలు కూడా చాలా లేట్ గా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే పిల్లలు త్వరగా మాట్లాడాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఘన ఆహారం
మీ పిల్లలకు 6 నెలల వయస్సు రాగానే ఘనమైన ఆహారాలు, ధాన్యాలను తినిపిస్తుంటారు. కానీ చాలా మంది తల్లులు మాత్రం తమ బిడ్డను శుద్ధి చేసి పండ్లు, పప్పులు, ధాన్యాలను తినిపిస్తుంటారు. కానీ దీనివల్ల కత్తిరించే, నమిలే కండరాలు సరిగా అభివృద్ధి చెందవు. మీకు తెలుసా? పిల్లాడు ఫుడ్ ను కొరికి నమిలినప్పుడు నాలుక కండరాలు బలంగా అవుతాయి. దీనివల్ల వారు మాట్లాడే నైపుణ్యం త్వరగా అభివృద్ధి చెందుతుంది.