చిన్న పిల్లలు చిటికీ మాటికీ ఏడుస్తూ ఉంటారు. మాటలు వచ్చిన పిల్లలు అయితే, తమ బాధ ఏంటో చెబుతారు. కానీ మాటలు రాని పసి పిల్లలు అయితే వారి బాధ చెప్పలేరు. ఏడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను ఊరుకోపెట్టడం అందరికి రాదు. కానీ సింపుల్ చిట్కాలతో పిల్లలను ఏడుపు తగ్గించుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
baby cry
1.పిల్లలు ఏడ్వగానే ముందుగా వారు ఫిజికల్ గా కంఫర్ట్ గా ఉన్నారో లేదో చూడాలి. కంఫర్ట్ గా లేకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది చెక్ చేస్తే వారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థమౌతుంది.
2.లేదంటే మీ పిల్లలకు ఒంట్లో బాగో లేదా, జ్వరం అలాంటివి ఏమైనా వచ్చాయో లేదో చెక్ చేయాలి. లేదంటే ఏదైనా నొప్పితో బాధపడుతున్నారో లేదో కూడా చూడాలి. అలాంటి సమయంలో కూడా వారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.
3. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను చెక్ చేయాలి. ఏవైనా గట్టి శబ్దాలు లాంటివి వచ్చినా కూడా పిల్లలు డిస్టర్బ్ అయ్యి కూడా ఏడుస్తూ ఉంటారు.
4.కారణం ఏదైనా పిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు వారితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. మీరు వారితో మాట్లాడటం వల్ల వారు ఏడుపు ఆపే అవకాశం ఉంటుంది. లేదంటే ఏదైనా పాట పాడటం లాంటివి చేయాలి.
5.పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఒకసారి ఇంట్లో లైట్స్ ని మీరు చెక్ చేయాలి. అంటే, లైట్ కారణంగా వారు ఏడుస్తున్నారేమో మీరు చెక్ చేయాలి. లైట్ ఆఫ్ చేయడం వల్ల వారు ఏడుపు ఆపి ప్రశాంతంగా నిద్రపోతారేమో చూడండి.
baby cry
6.పిల్లలు ఆపకుండా ఏడుస్తున్నప్పుడు వాళ్లను పైకి చిన్నగా ఎత్తడం లాంటివి చేయాలి. అలా చేయడం వల్ల వారు ఏడుపు ఆపి, మళ్లీ నవ్వేస్తారు.
7.పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్న సమయంలో వారి చుట్టూ ఉన్న వస్తువులను మార్చి చూడండి. అంటే, దుప్పటి లాంటివి మార్చండి. వాటి వల్ల వారు ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో చెక్ చేయాలి.
8.లేదు, అయినా ఏడుపు ఆపడం లేదు అంటే.. వారిని ఎత్తుకొని వీపు మీద నెమ్మదిగా జో కొడుతున్నట్లుగా కొట్టాలి. అలా చేయడం వల్ల వారు వెంటనే ఏడుపు ఆపే అవకాశం ఉంటుంది.
9.పిల్లలు ఏడ్వగానే ముందు మీరు కంగారు పడొద్దు. మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకోవాలి. అప్పుడు పిల్లలను కూడా ఏడుపు ఆపించగలుగుతారు.