ఇంట్లో ఆడపిల్ల ఉందా? తండ్రి చేయాల్సిన పనులు ఇవే..!

First Published Jun 7, 2023, 12:56 PM IST

ఒక ఆడపిల్ల జీవితంలో తండ్రి సపోర్ట్ చాలా అవసరం. కానీ, ఇంట్లో ఆడ పిల్ల ఉన్నప్పుడు తండ్రి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అవేంటో  ఓసారి చూద్దాం...
 

ఆడపిల్లల జీవితంతో వాళ్ల తండ్రి ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాడు. తన తండ్రి లాంటి మరో వ్యక్తి మరొకరు ఉండరు అని మురిసిపోతుంది. తనకు కూడా తన తండ్రి లాంటి వ్యక్తే జీవితంలో కి రావాలని కోరుకుంటుంది. ఒక ఆడపిల్ల జీవితంలో తండ్రి సపోర్ట్ చాలా అవసరం. కానీ, ఇంట్లో ఆడ పిల్ల ఉన్నప్పుడు తండ్రి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అవేంటో  ఓసారి చూద్దాం...
 

father, daughter, love,

1. వారిని మీ కొడుకుతో పోల్చడం మానుకోండి

చాలా మంది ఇంట్లో ఆడపిల్లలను ఇష్టపడరు. మగ పిల్లలు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. ఒకవేళ తమకు కొడుకు లేకుంటే, కూతురిని కొడుకులా పెంచాలని అనుకుంటారు. లేదంటే వారితో పోలుస్తూ ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతిసారీ తమకు కొడుకు లేడు అనే విషయాన్ని కూతురు ముందు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ కుమార్తె ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి, ఆ పొరపాటు చేయకూడదు.

child, father

2.కూతురి ముందు మీ భార్యను చూసే విధానం..

మనలో చాలా మంది తమ భార్యలను చాలా దారుణంగా చూస్తారు. ప్రతిరోజూ భార్య కష్టపడి మనకోసం అన్నీ చేస్తున్నా, అది గుర్తించకుండా శారీరకంగా, మానసికంగా మాటలతో, చేష్టలతో బాధపెడుతూ ఉంటారు. ఇవన్నీ మీరు మీ కూతుళ్ల ముందు చేస్తున్నారా? అది వారిని పెళ్లి అంటే భయపడేలా చేస్తుంది. తనపై అంత ప్రేమ కురిపించే తండ్రి తన తల్లి విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, రేపు తన భవిష్యత్తు కూడా అలానే ఉంటుందనే భయం ఆమెలో అప్పటి నుంచే మొదలౌతుంది.
 

3. ఇంటి పనులు చేయమని సూచించడం..

ఇంట్లో పనులు ఆడవారు మాత్రమే చేయాలి అనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే, చిన్నప్పటి నుంచే ఇంటి పనులు చెబుతూ ఉంటారు. పనులు నేర్పించడం తప్పు కాదు. కానీ, కేవలం ఆడ పిల్ల మాత్రమే చేయాలి అనే ముద్ర మాత్రం వేయకూడదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనే విషయం ఆడపిల్లకి, ఇంట్లో మగ పిల్లలకు నేర్పించాలి.

4.మీ జీవనశైలిని వారిపై రుద్దకండి

సాధారణంగా, తండ్రులు తమ కుమార్తెల పట్ల అతిగా స్వాధీనపరుచుకుంటారు, ఇది తరచుగా వారి జీవితాల్లో అధిక జోక్యం కలిగిస్తుంది. మీ కుమార్తె భద్రత గురించి ఆందోళన చెందడం ఆమోదయోగ్యమైనది, అదే సమయంలో ఆమెకు స్వేచ్ఛ కూడా ఇవ్వాలి అనే విషయం తెలుసుకోవాలి. మీ ఆలోచనలు వారిపై రుద్దకండి.
 


5.మీరు మాట్లాడలేనంత బిజీగా ఉన్నారని చెప్పడం

మీ కుమార్తె మీతో అన్ని విషయాలను పంచుకోగలిగే స్వతంత్రం ఇవ్వాలి. కేవలం తల్లితోనే కాదు, తండ్రితో కూడా పంచుకోగలిగేలా చేయాలి. వ్యక్తిగత ఇబ్బందులు, సవాళ్ల గురించి మాట్లాడటానికి ఆమె మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆమెను గౌరవంగా,విశ్వాసంతో చూస్తారని ఆమె తెలుసుకోవాలి. 

click me!