ఉరుకుల పరుగుల జీవితం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే గడిచే రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో పిల్లలకు మంచి, చెడు ఎలా తెలుస్తాయి? పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు మంచిగా పెరుగుతారో ఇప్పుడు చూద్దాం.
పిల్లల్ని బాగా పెంచడానికి కఠినమైన నియమాలు అవసరం లేదు. ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత చాలు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకూడదు, వాళ్ళ ప్రతిభను గుర్తించి మార్గనిర్దేశం చేయాలి. వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని, దాన్ని ఎలా సాధించాలో నేర్పాలి.