క్రికెట్ సహా ఇతర క్రీడల్లో రిజర్వేషన్ల డిమాండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఆనాదిగా కొనసాగుతూ వస్తున్న ఈ వివక్షకు ఇక్కడితో ఓ పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఫుట్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో రాణిస్తోన్న దళిత, ఆదివాసీలకు క్రికెట్‌లో ఎందుకు స్థానం దక్కటం లేదనే ప్రశ్నకు బీసీసీఐ, ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

అధికారిక జాతి వివక్షను చవిచూసిన దక్షిణాఫ్రికాను ఈ విషయంలో బీసీసీఐ, ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. క్రీడా రంగంలో ప్రాతినిథ్యం కోల్పోయిన నల్ల జాతీయులకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది.
రిజర్వేషన్ల అండతోనే కగిసో రబాడ, లుంగి ఎంగిడి వంటి సూపర్‌ఫాస్ట్ బౌలర్లు ప్రపంచ క్రికెట్‌కు లభించారు. రిజర్వేషన్లు లేకుంటే హషీమ్ ఆమ్లా వంటి ఆల్‌టైమ్ గ్రేమ్ బ్యాట్స్‌మన్‌ను క్రికెట్ ప్రపంచం చూసి ఉండేది కాదు. భారత క్రికెట్‌లో రిజర్వేషన్లు లేకపోవటంతో.. మన రబాడ, ఎంగిడి, ఆమ్లాలు గల్లీ క్రికెట్ నుంచే కెరీర్‌ను ముగిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు ఇక అనివార్యం.

కారణం ఏమిటి....?
దురదృష్టశావత్తూ క్రికెట్, దళితుల ప్రాతినిథ్యంపై భారత్‌లో క్రియాశీల చర్చ జరుగలేదు. క్రికెట్‌లో అణగారిన వర్గాల ప్రాతినిథ్యంపై పరిశోధనలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో లేవు. రామచంద్ర గుహ, సిరివయణ్ ఆనంద్, బొరియా మజుందార్‌లు తమ వ్యాసాలు, పుస్తకాల్లో ఈ విషయాన్ని స్మృశించారు. భారత్‌లో అంటరానితనాన్ని ఇప్పటికీ 27 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో పాటిస్తున్నారనే విషయం భారత మానవాభివృద్ధి సర్వేలో వెల్లడైంది.

క్రికెట్‌కు దళితులు దూరంగా ఉండటానికి ఇతర కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి!. క్రికెట్ ముందునుంచీ నగరవాసుల ఆట. భారత క్రికెట్ తొలి 50 ఏండ్లలో కేవలం ఏడుగురు క్రికెటర్లు మాత్రమే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు.
మిగతా అందరూ పట్టణప్రాంతాలకు చెందినవారే. అందులో 90 శాతం అగ్రకులాలకు చెందిన వారు. 1950-1990 వరకు భారత క్రికెట్‌లో బ్రాహ్మణ ఆధిపత్యం స్పష్టం. 2008 ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో భారత తుది జట్టులో ఆరుగురు బ్రాహ్మణులే ఉండటం ఇందుకు నిదర్శనం (ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సైమండ్స్‌పై జాతివివక్ష వ్యాఖ్యల వివాదం ఈ టెస్టులోనే చోటుచేసుకుంది).

ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు అవసరమైన మౌళిక సదుపాయాలు పట్టణ ప్రాంతాలకే పరిమితం. అప్పట్లో పట్టణ ప్రాంతాల్లో దళిత, ఆదివాసీల శాతం స్వల్పం. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన దళిత, ఆదివాసీలు గల్లీ క్రికెట్ మెరుపులతోనే సరిపెట్టుకున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి భారత క్రికెట్‌లో ఓబీసీ (వెనుకబడిన తరగతులు) ప్రాతినిథ్యం మెరుగవుతోంది.
విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లతో ఆర్థికంగా కొంతవరకు పుంజుకున్న ఓబీసీలు ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనంలోనే కొట్టుమిట్టాడుతున్న దళిత, ఆదివాసీలు భారత క్రికెట్ వైపు అడుగులు వేసే ఆలోచనే చేయటం లేదు.

మహిళా క్రికెట్ ను చూసి నేర్చుకోవాలి....!
భారతీయ క్రికెట్‌లో రిజర్వేషన్ల ఫార్ములా విజయవంతమైంది!.అవును, బీసీసీఐ ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకపోయినా.. మహిళల క్రికెట్‌లో అగ్రకులాల ఆధిపత్యం అంతగా కనిపించదు. అందుకు కారణం, మహిళల క్రికెట్ సంస్థాగత నిర్మాణం బీసీసీఐ కనుసన్నల్లో జరుగలేదు.
2017 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన భారత మహిళల జట్టులో భిన్నత్వం సుస్పష్టం. పురుషుల జట్టు మాదిరిగా అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడా కనిపించదు!. ఎందుకంటే, భారత మహిళల జట్టులోని 15 మంది క్రికెటర్లలో 10 మంది రైల్వే ఉద్యోగులే.

రైల్వే విభాగంలో రిజర్వేషన్లు ఉండటంతో రైల్వే జట్టులో భిన్నత్వం కనిపిస్తోంది. బీసీసీఐ సొంతంగా మహిళల క్రికెట్‌ను అభివృద్ది చేయలేదు, దీంతో పురుషుల జట్టు మాదిరి అగ్రకులాల ఏకత్వం కనిపించదు. రిజర్వేషన్లు కల్పిస్తే జాతీయ జట్టు తేలిపోతుందనే పసలేని వాదనలకు మహిళల క్రికెట్ జట్టు సక్సెస్ సరైన సమాధానం. బీసీసీఐ సంస్థాగత వ్యవస్థ దళిత, ఆదివాసీలను క్రికెట్‌కు దూరం చేసిందనే వాదనకు బలమైన నిదర్శనం ఇదే.

సామాజిక నేపథ్యం కూడా చెప్పుకోలేని వైనం!
భారత టెస్టు క్రికెట్‌కు నలుగురు దళితులు ప్రాతినిథ్యం వహించినా.. ఏనాడూ ఆ నలుగురిలో ఒకరైనా బహిరంగంగా తమ సామాజిక నేపథ్యం వెల్లడించలేదు. సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లి చివరగా భారత క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన దళిత క్రికెటర్.
రమాకాంత్ అచ్రేకర్ శిష్యులలో ఒకరైన అనిల్ గురవ్‌కి ముంబయి వివ్ రిచర్డ్స్ అని పేరు. ఒకప్పటికి సచిన్ ఆడిన టీం కెప్టెన్ పూర్తిగా క్రికెట్‌కు దూరమైపోయాడు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ సెలక్షన్ ప్రక్రియలో 'కుటుంబ నేపథ్యం' ప్రధానం అవుతుందని ఓ ఇంటర్వ్యూలో అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తొలి దళిత క్రికెటర్ పల్వాంకర్ బలూను భారత క్రికెట్ గ్రేటెస్ట్‌గా చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొంటారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే పరిమితమైన దళిత లెజెండ్ 33 మ్యాచుల్లో 179 వికెట్లు కూల్చాడు. 17 సార్లు ఐదు వికెట్లు, 4 సార్లు పది వికెట్లు పడగొట్టాడు. పల్వాంకర్ దళితుల పట్ల వివక్షపై గళమెత్తాడు. కానీ ఆధునిక క్రికెట్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్లు ఎవరూ తమ నేపథ్యం గురించి చెప్పుకోలేకపోయారు.

మరింత కుంగదీసే ఆర్ధిక భారం!
క్రికెట్‌లోకి అణగారిన వర్గాలు ప్రవేశానికి ఆర్థిక మూలాలు సైతం ప్రతికూలంగా మారుతున్నాయి. క్రికెట్ చారిత్రకంగా క్లాసికల్ గేమ్. దక్షిణాఫ్రికా సహా ఇతర జట్లలో సైతం 'క్లాస్' వర్గాల ఆధిపత్యం కనిపిస్తోంది. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ది పైచేయి. అందుకు అనుగుణంగానే బ్యాట్స్‌మెన్ అందరూ అగ్రకులాలకు చెందినవారే ఉంటారు.
భారత క్రికెట్‌లో 8 మంది ముస్లింలు కనిపించగా..అందులో ఐదుగురు పేస్ బౌలర్లుగానే అరంగేట్రం చేశారు. నలుగురు దళిత క్రికెటర్లలో ముగ్గురు బౌలర్లేనని గణాంకాలు చెబుతున్నాయి.

ఐపీఎల్‌లోనూ 27 మంది ముస్లింలు బౌలర్లు కాగా.. మరో 8 మంది ఆల్‌రౌండర్లు. 8 మంది మాత్రమే బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. బ్యాట్స్‌మన్‌కు అవసరమైన కిట్ ఎంతో ఖరీదు, అందుకే బౌలింగ్‌ను ఎంచుకున్నానని సఫారీ యువ పేసర్ లుంగి ఎంగిడి స్వయంగా వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో తెంబ బవుమా మినహా నల్ల జాతి క్రికెటర్లు అందరూ బౌలింగ్ విభాగానికే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

రేజర్వేషన్లకు సమయం ఆసన్నమయింది...!
దక్షిణాఫ్రికా క్రీడల్లో రిజర్వేషన్లు (జట్టులో ఆరుగురు శ్వేతేతరులు ఉండాలి, అందులో ఇద్దరు ఆఫ్రికా నల్లజాతీయులు తప్పనిసరిగా ఉండాలి) తీసుకొచ్చినప్పుడు తెల్ల జాతీయులు పెదవి విరిచారు, విమర్శలు గుప్పించారు. కానీ రిజర్వేషన్లను అంత గుడ్డిగా అమలు చేయలేదు.
స్కూల్ క్రికెట్ నుంచి మొదలుపెట్టి జాతీయ జట్టు స్థాయిలో అమలు చేశారు. తద్వారా జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లు రాలేదనే విమర్శకు తావులేకుండా చేయగలిగారు. దక్షిణాఫ్రికా ఫార్ములా నుంచి భారత్ స్ఫూర్తి పొందాలి.

డివిజన్, రాష్ట్ర స్థాయి, దేశవాళీ సర్క్యూట్‌లో ముందు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. అనంతరం జాతీయ జట్టుకు రిజర్వేషన్లు వర్తింపచేయాలి. క్రికెట్‌లో రిజర్వేషన్లు రాకముందు దక్షిణాఫ్రికా టెస్టుల్లో ఏడో స్థానంలో ఉండేది. రిజర్వేషన్ల అమలు అనంతరం దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది.
విదేశీ పరిశోధకులు భారత క్రికెట్‌లో కుల వివక్షపై వ్యాసాలు రాసినా, ప్రసంగాలు చేసినా బీసీసీఐ వర్గాలు, మీడియా నుంచి సూటి విమర్శలు ఎదురవుతున్నాయి. అసలు భారత క్రికెట్‌కు ప్రాతనిథ్యం వహించే ఆటగాళ్లకు ఒకరి నేపథ్యం మరొకరికి తెలియదని, ఇక కుల వివక్ష ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.

కులాల వారీగా ప్రాతినిథ్య నిష్పత్తి కప్పిపుచ్చేందుకే బీసీసీఐ అధికారికంగా ఎటువంటి గణాంకాలు నమోదు చేయటం లేదు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో సైతం దళిత, ఆదివాసీ వర్గాల ప్రాతినిథ్యంపై స్పష్టమైన సమాచారం లేదు.

దక్షిణాఫ్రికా ఒప్పుకుంది, మరి భారత్...?
జాతి వివక్ష అసమానతలను దక్షిణాఫ్రికా అంగీకరించింది. జరిగిన నష్టాన్ని దిద్దుకునేందుకు నిర్మాణాత్మక అడుగులు వేస్తోంది. కానీ ఇతర ప్రజాస్వామిక దేశాలు వివక్షను అసలు గుర్తించటం లేదు. భారత్ అసలు మాదగ్గర వివక్ష లేదు, వివక్ష ఉండబోదు అంటూ ప్రకటిస్తోంది. వివక్షను దుప్పటి కింద దాచిపెడుతోంది. క్రికెట్‌లో కుల వివక్షను గుర్తించి, ఇన్నేండ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ అడుగు ముందుకేయాలి. భారత క్రికెట్‌లో దళిత, ఆదివాసీల ప్రాతినిథ్యానికి సమయం ఆసన్నమైంది, ప్రజా ఉద్యమానికి ముందే బీసీసీఐ దళిత, ఆదివాసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ప్రకటించటం ఉత్తమం!.

భారత్ టెస్టు హౌదా పొంది 88 ఏండ్లు అవుతోంది. ఇన్నేండ్లలో భారత జట్టుకు 296 మంది క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. అందులో కేవలం నలుగురు మాత్రమే దళిత, ఆదివాసీలు. దామాషా ప్రకారం దళిత, ఆదివాసీల ప్రాతినిథ్యం సంఖ్య సుమారు70 మంది క్రికెటర్లుగా ఉండాలి.
క్రికెట్‌లో లోపించిన డైవర్సిటీ గణాంకాలను విస్మరించడాన్ని ప్రజలు, అభిమానులు బహుశా పట్టించుకోకపోచ్చు. ప్రపంచ క్రికెట్‌లో పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్ ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

జాతీయ క్రికెట్ జట్టుకు అగ్రకులాల వారు మాత్రమే ఎందుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు?!. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు అన్ని రంగాల్లో భిన్నత్వం, సమాన అవకాశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అందుకు విరుద్ధంగా వెళ్తోంది. అనధికారిక వివక్షగా కొనసాగుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దే సమయం ఆసన్నమైంది.