CIBIL score, marriage cancelled అయ్యోపాపం..! సిబిల్ స్కోర్ పెళ్లి ఆపేసిందిగా!!

Published : Feb 09, 2025, 08:37 AM IST

పెళ్లి సంబంధం కలుపుకునేముందు అబ్బాయి, అమ్మాయి గుణగణాలు, కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తులు చూడటం సహజం. కానీ ఒక పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు తక్కువగా ఉందని పెళ్లి ఆగిపోయిన విచిత్ర సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పెళ్లికూతురు మామ, పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ ఎంతో చూడాలని పట్టుబట్టాడు. స్కోర్ తక్కువగా ఉండడంతో పెళ్లి ఆగిపోయింది.

PREV
16
CIBIL score, marriage cancelled అయ్యోపాపం..!  సిబిల్ స్కోర్ పెళ్లి ఆపేసిందిగా!!
సిబిల్ స్కోర్ విషాదం

పెళ్లి కుదిర్చే విషయంలో పెద్దలు చాలా విషయాలు చూస్తారు. వాటి విషయంలో సంత్రుప్తి చెందాకే పెళ్లిళ్లు జరుగుతాయి లేదా ఆగుతాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఒకరి పెళ్లి విషయంలో అతని సిబిల్ స్కోరే విలన్ అయ్యింది.

26
తక్కువ సిబిల్ స్కోర్‌తో పెళ్లి ఆగిపోయింది

పెళ్లికూతురు మామ, పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ చూడాలనుకున్నాడు. పెళ్లి ఖాయం కావడానికి ముందు స్కోర్ చూడాలని పట్టుబట్టాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో జరిగింది.

36
సిబిల్ స్కోర్ లోపాలు

ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. మిగతా వివరాల గురించి చర్చించాలనుకున్నారు. ఆ సమయంలో పెళ్లికూతురు మామ, పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ చూడాలని అడగడంతో పరిస్థితి మారిపోయింది.

46
సిబిల్ స్కోర్ పెళ్లిని ఎలా ఆపింది?

మామ పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ చూసి అసంతృప్తి చెందాడు. పెళ్ళికొడుకు పేరు మీద వివిధ బ్యాంకుల్లో చాలా రుణాలు ఉన్నాయని తెలిసి పెళ్లికూతురు వాళ్ళు షాక్ అయ్యారట. దీంతో ఆ యువకుడి సిబిల్ స్కోర్ కూడా తక్కువగా ఉందట. తక్కువ సిబిల్ స్కోర్ అంటే చెడ్డ క్రెడిట్ హిస్టరీ. సాధారణంగా ఇది ఆర్థిక అస్థిరతకు సూచిక.

56
చెడ్డ సిబిల్ స్కోర్‌తో పెళ్లి రద్దు?

ఈ దశలో, పెళ్లికూతురు మామ పెళ్లికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతను తన భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడు. కాబట్టి తన మేనకోడలికి సరైన వాడు కాదని వాదించాడు. పెళ్లికూతురు వాళ్ళు కూడా అదే చెప్పి పెళ్లి సంబంధం తెంచుకుంటున్నామని చెప్పేశారు.

66
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని సంక్షిప్తంగా చెప్పే మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుండి 900 వరకు ఉంటుంది. ఎక్కువ ఉంటే మంచి ఆర్థిక నిర్వహణను సూచిస్తుంది. అదే సమయంలో తక్కువ స్కోర్ ఉంటే చెడు ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి బ్యాంకు అధికారులు సిబిల్ స్కోర్‌ను ప్రధాన కారణంగా ఉపయోగిస్తారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుంది.

click me!

Recommended Stories