హరియాణాలో హోరాహోరీ: లోక్ సభ ఎన్నికల్లో మాదిరి కాంగ్రెస్‌కు సర్ప్రైజ్ వస్తుందా?

First Published | Sep 16, 2024, 2:04 PM IST

2024 హరియాణా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ బలమైన పోటీనిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోగా.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజా మద్దతును పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా..?

 

రాజకీయ ఉద్ధండ పార్టీ కాంగ్రెస్‌కి బీజేపీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు మరోసారి హరియాణాపై కన్నేసింది. 

కాగా, రాజకీయాల్లో ఇంకా చాలా చిన్న వయసులో ఉన్న జేజేపీ ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. 2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక వేదికపై పోటీ చేసి 14.84 శాతం ఓట్లతో 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో సంకీర్ణ పాలనను కొనసాగించింది. అయితే, 2019లో 58.2 శాతంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం 2024 నాటికి 46.11 శాతానికి తగ్గింది.

modi vs rahul

2024లో ఇండియా బ్లాక్ ఓట్ల శాతం బీజేపీ కంటే ఎక్కువగా ఉంది. తొమ్మిది లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్‌కు 43.67 శాతం ఓట్లు రాగా... ఒక స్థానానికి (కురుక్షేత్రం) పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి 3.94 శాతం ఓట్లు దక్కాయి. విపక్షాలకు కలిపి 47.61 శాతం ఓట్లు వచ్చాయి.


కాగా, ఈసారి హరియాణాలో బీజేపీకి వ్యతిరేకత ఎదురుకానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చిలో పంజాబీ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ అధిష్టానం. కాగా, ఇటీవల సైనీ సామాజిక కార్యక్రమాల గురించి ప్రకటనలు చేశారు. రాష్ట్ర పరిపాలనలో అన్ని ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను మరో ప్రతినిధి తెరపైకి తెచ్చారు. అయితే, 2014, 2019 ఎన్నికల మాదిరిగానే 2024 అసెంబ్లీ ఎన్నికలను జాట్ వర్సెస్ జాట్యేతర సామాజిక వర్గం ఎన్నికలుగా చిత్రీకరించడం కష్టమని కాంగ్రెస్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అగ్నివీర్ ప్రణాళిక, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ కష్టాలు, అనేక "పేపర్ లీక్" సంఘటనలతో సహా అనేక అంశాలపై భూపిందర్ సింగ్ హుడా- ఉదయ్ భాన్ కలయిక విజయవంతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి నేతృత్వం వహిస్తున్న దళితుడు భన్... 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.6,000 వృద్ధాప్య పింఛన్ లాంటి సంక్షేమ పథకాల హామీలిచ్చారు. 

గత లోక్‌సభ ఎన్నికల్లో చెరో ఐదు పార్లమెంటు స్థానాలను బీజేపీ, కాంగ్రెస్‌ కూటమిలు సొంతం చేసుకున్నాయి. పది స్థానాలకు గాను నాలుగు చోట్ల యాభై వేల లోపు ఓట్ల మెజారిటీ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ బయటపడ్డాయి. వాటిలో అంబాలా, సోనేపట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా... భివానీ- మహేంద్రగఢ్, కురుక్షేత్రలను బీజేపీ గెలుచుకుంది.

Latest Videos

click me!