ఇలాంటి ప్రమాదంపై ఇస్రో అప్రమత్తమైంది. నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ - అనాలిసిస్ అంటే NETRA అపోఫిస్‌ను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తుంది. రాబోయే ఎలాంటి ముప్పును అయినా ఎదుర్కోవటానికి ఇతర దేశాల నుండి కూడా సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఉల్క భూమికి అత్యంత సమీపంలోకి వస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, అపోఫిస్ ఉల్కను మొదటిసారి 2004లో గుర్తించారు. ఇది 2029లో భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ఆ తర్వాత 2036లో రెండోసారి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు. ఇలాంటి నేపథ్యంలోనే భూమిపై దాని ప్రభావం గురించి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పరిశోధకులు.
2029 లో భూమికి దగ్గరగా వస్తుందని పేర్కొంటున్న రిపోర్టుల మధ్య పలువురు ఎర్త్ ను ఢీకొంటుందనీ, అలాంటి అవకాశం లేదని మరికొందరు పరిశోధకులు వాదనలు చేస్తున్నారు. కానీ అంతరిక్షంలో కొనసాగుతున్న ఈ కదలికకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట వాదనలు లేవు. అటువంటి పరిస్థితిలో ఈ భారీ ఉల్క గమనం గురించి రాబోయే రోజులే ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలవు.