ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో ఓ వ్యక్తిని భార్య, భార్య సోదరి కట్టేసి కర్రలతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను పంపిన డబ్బును ఎలా ఖర్చు చేశారో చెప్పాలంటూ భార్యను సదరు వ్యక్తి అడగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
25
viral video
శివకుమార్ అనే వ్యక్తి బనారస్‌లో నివాసం ఉంటూ తన సోదరుడితో కలిసి కుల్ఫీ బండి నడుపుతున్నాడు. ప్రతి నెలా శివకుమార్ తన భార్య సుశీలకు ఇంటి ఖర్చుల కోసం డబ్బులు పంపేవాడు.
35
viral video
బనారస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన శివకుమార్ తన భార్య తనకు ఏ మాత్రం చెప్పకుండా ఎనిమిది క్వింటాళ్ల గోధుమలను అమ్మినట్లు తెలిసింది. దీంతో గోధుమలు ఎందుకు అమ్మావని సుశీలను నిలదీశాడు.
45
viral video
అలాగే తను పంపిన రూ.32 వేలకు లెక్క చెప్పమని అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన సుశీల తన సోదరితో కలిసి శివకుమార్ చేతులు కట్టేసి కర్రలతో కొట్టడం ప్రారంభించింది.
55
viral video
దాడికి పాల్పడినట్లు శివకుమార్ ఫిర్యాదు చేశారని, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతి భంగం కలిగించేలా అవమానించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.