కలవరపెడుతున్న వైట్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్.. బీహార్లో 4 కేసులు..

First Published May 21, 2021, 12:49 PM IST

కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న వేళ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు భయపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా దీనికి కొత్తగా వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న వేళ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు భయపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా దీనికి కొత్తగా వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
undefined
బీహార్లోని పాట్నా వైద్య కళాశాలలో తాజాగా 4 వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఈ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
undefined
వైట్ ఫంగస్ ఉన్న నలుగురికీ కరోనా సోక లేదని తెలిపారు. కాకపోతే వైట్ ఫంగస్ రోగుల్లో కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు.
undefined
పట్నా మెడికల్ కళాశాల మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ మాట్లాడుతూ... నాలుగు వైట్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినప్పటికి కరోనా నెగటివ్ గా తేలిందన్నారు.
undefined
దీనిపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. నలుగురు రోగులు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, వారికి యాంటీ ఫంగల్ ఔషధాలు ఇస్తున్నట్లు తెలిపారు.
undefined
బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
undefined
కేవలం ఊపిరితిత్తుల పైనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలైన గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, ప్రైవేటు భాగాలు, నోటి భాగాలపై వైట్ ఫంగస్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
undefined
వైట్ ఫంగస్ లక్షణాలు ఏమిటంటే.. కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా కనబడుతున్నట్లు వైద్యులు తెలిపారు.ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని హెచ్ఆర్ సిటి టెస్ట్ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.
undefined
దీని ద్వారా ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది అంటే... బ్లాక్ ఫంగస్ సోకిన మాదిరిగానే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారికి వైట్ ఫంగస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, స్టిరాయిడ్లు ఎక్కువగా వాడడం వల్ల వైట్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
undefined
click me!