కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే తీపి కబుర్లు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది.

అలాగే 6-8 నెలల తర్వాతే వైరస్ థార్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే సెకండ్ వేవ్ లాగా తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్, టెక్నాలజీ విభాగం ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది.

సూత్ర అంటే ససెప్టబుల్, అన్ డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్.. అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. ఈ మేరకు బృందంలో ఒకరైన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వివరాలను వెల్లడించారు.

దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్ ఆఖరు నాటికి ఇది 20 వేలకు తగ్గుతుందని బృందం అంచనావేసింది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరా ఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్ర దశకు చేరిన అగర్వాల్ తెలిపారు.

తమిళనాడు, పంజాబ్, పుదుచ్చేరి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ లు ఈనెల 19 నుండి 31 మధ్య అత్యంత తీవ్ర దశకు చేరుతాయని అంచనా వేశారు.

థార్డ్ వేవ్ ఎప్పుడంటే : సూత్ర ప్రకారం దేశంలో అక్టోబర్ వరకు కరోనా థార్డ్ వేవ్ ఉండకపోవచ్చని అగర్వాల్ తెలిపారు. థార్డ్ వేవ్ స్థానికంగానే ఉంటుంది. వ్యాక్సినేషన్ కారణంగా ఎక్కువమంది దీనికి ప్రభావితం కాకపోవచ్చు అని పేర్కొన్నారు.

సూత్ర మోడల్ ఏంటంటే...తీవ్రత, విధాన నిర్ణయాల ప్రభావం వంటి వాటిని అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. గతేడాది ఈ మోడల్ ను అనుసరించడం ప్రారంభించారు. ఈ ‘జాతీయ కోవిడ్ 19 సూపర్ మోడల్ కమిటీ’ దీని ఆధారంగానే భారత్లో కోవిడ్ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది. దేశంలో రెండో ఉధృతి తీరును ముందుగా అంచనా వేయలేక పోయినట్లు కమిటీ అంగీకరించింది.