పెళ్ళి పూర్తయ్యింది, అప్పగింతలే మిగిలాయి.. ఈ టైంలో పెళ్లికొడుకు హిజ్రా అని తెలిసి...

Published : Feb 18, 2026, 09:37 AM ISTUpdated : Feb 18, 2026, 09:53 AM IST

పెళ్లి జరిగిపోయింది, ఇక అప్పగింతలే మిగిలాయి. ఆ తంతూ ముగిస్తే అమ్మాయి అబ్బాయి ఇంటికి చేరుకుంటుంది. ఈ సమయంలో పెళ్లికొడుకు మగాడు కాదు హిజ్రా అని తేలితే… ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. 

PREV
15
పెళ్ళి వేడుకలో ఊహించని ట్విస్ట్...

పెళ్ళి అనేది రెండు జీవితాలను ఒక్కటిచేసే పవిత్ర వేడుక. ఇద్దరు వ్యక్తులు ప్రేమానురాగాలు, కష్టసుఖాలు పంచుకుంటూ జీవితాంతం కలిసుండేలా చేస్తుంది. ఇది ప్రతిఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైంది... అందుకే పెళ్ళి చేసేముందు అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అంటే అమ్మాయి అబ్బాయి గురించి, అబ్బాయి అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలిశాకే పెళ్లి చేయాలన్నది పెద్దల మాట. కానీ పెళ్ళయిన కొన్ని గంటల్లోనే అసలు పెళ్లికొడుకు అబ్బాయే కాదని తెలిస్తే...? ఇలాంటి విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహ వేడుక సవ్యంగా జరిగి ఇక పెళ్లికూతురిని అత్తారింటికి పంపే కార్యక్రమం మొదలవ్వబోతుండగా కొందరు హిజ్రాలు పెళ్లి మండపానికి వచ్చారు... వాళ్లు పెళ్ళికొడుకును హిజ్రాగా గుర్తించడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. దీంతో పెళ్లి కూతురు తరపువారు కోపంతో ఊగిపోవడంతో పరిస్థితి చేయిదాటింది… పోలీసులు రంగప్రవేశం చేశారు. చివరికి పెళ్లికొడుకు బృందం పెళ్లికూతురు లేకుండానే వెనుదిరిగింది. ఈ ఘటన కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

25
పెళ్లయిన కొన్ని నిమిషాల్లోనే మారిపోయిన సీన్

ఉత్తర ప్రదేశ్ లోని దిలౌనా గ్రామానికి చెందిన రిషు అనే యువకుడికి ఫిబ్రవరి 13న ఓ యువతితో పెళ్లి జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి తంతు మొత్తం శాస్త్రోక్తంగా జరిగింది. జీలకర్ర బెల్లం, తాళిబొట్టు కట్టడం అంతా పూర్తయ్యాక అప్పగింతలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఓ ఆరుగురు హిజ్రాలు పెళ్లి జరుగుతున్న చోటికి వచ్చారు. మొదట అందరూ శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడుగుతారు కదా.. అలాగే వచ్చారేమో అనుకున్నారు. కానీ వాళ్లు వచ్చి పెళ్లికొడుకు అసలు మగాడే కాదు, తమలాంటి హిజ్రానే అని ఆరోపించారు. ఈ మాట వినగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

35
పెళ్లికొడుకుపై ఆరోపణలు.. బంధువులు పరార్

పెళ్ళికొడుకుపై హిజ్రాలు ఆరోపణలు చేయగానే గందరగోళం మొదలైంది. వాళ్లు పెళ్లికొడుకును పట్టుకుని, తమతో పాటు తీసుకెళ్తామని పట్టుబట్టారు. ఈ గొడవ చూసి పెళ్లికొడుకు తరఫున వచ్చిన చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికొడుకును, అతని తల్లిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

45
పోలీసుల వద్దకు పంచాయితీ

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చాలాసేపు నచ్చజెప్పిన తర్వాత గొడవ సద్దుమణిగింది. చివరికి పెళ్లికూతురు లేకుండానే పెళ్లి బృందం వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. నిజానిజాలు తేలిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

55
సోషల్ మీడియాలో చర్చ.. చట్టపరమైన ప్రశ్నలు

ఈ ఘటన పెళ్లిళ్లు, వాటిలో పారదర్శకతపై చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. పెళ్లి లాంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు ఇరుపక్షాలు అన్ని విషయాలను స్పష్టంగా పంచుకోవడం చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు. అలాగే ఎలాంటి వైద్య, చట్టపరమైన నిర్ధారణ లేకుండా ఒకరిపై బహిరంగంగా ఆరోపణలు చేయడం కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి పోలీసుల విచారణ తర్వాతే అసలు నిజం ఏంటో తేలుతుంది.

ఈ ఘటన వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బారాబంకిలో జరిగిన ఈ ఘటన ఒక సాధారణ పెళ్లి వేడుకతో మొదలై పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు పోలీసుల విచారణలో ఏం తేలుతుందనే దానిపై అందరి దృష్టి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories