Sangeetha: విజయ్ దళపతి విడాకుల కేసులో కొత్త మలుపు.. మనసు మార్చుకున్న సంగీత..?

Published : May 06, 2026, 04:45 PM IST

Sangeetha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించాడు విజయ్ దళపతి. ఈ ఎన్నికలకు ముందే ఆయన తన భార్యతో విడాకులు తీసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరి విడాకుల కేసు ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. 

PREV
13
Vijay Sangeetha

దేశ వ్యాప్తంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. ఊహించని విధంగా విజయ్ దళపతి అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ఆయన గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా... ఈ ఎలక్షన్ వేళ విజయ్ పేరు సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో... హీరోయిన్ త్రిష పేరు కూడా అంతే ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా త్రిష పుట్టిన రోజు నాడే.. విజయ్ విజయ కిరీటం అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఎన్నికలకు ముందు చాలా హడావిడి చేసిన ఆయన భార్య సంగీత.. విజయ్ గెలుపు తర్వాత ఎక్కడా కనిపించకపోవడంపై ప్రశ్నలు వినపడుతున్నాయి.

23
విజయ్- సంగీతా విడాకుల కేసు...

విజయ్- సంగీత కొద్ది నెలల క్రితమే ఫ్యామిలీ కోర్టులో విడాకులకు మంజూరు చేశారు. విజయ్ కి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే కారణంతో సంగీత ఈ విడాకులకు అప్లై చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమె ఈ కేసు దాఖలు చేసింది. తర్వాత ఇద్దరూ మ్యూచువల్ గా విడిపోతున్నామంటూ కోర్టుకు తెలియజేసింది. దీంతో.. వీరిద్దరూ కచ్చితంగా జూన్ 15న కోర్టులో హాజరు కావాలని.. ఆరోజు తుది నిర్ణయం చెబుతామని కోర్టు తెలియజేసింది. అయితే.. సడెన్ గా ఇప్పుడు ఈ విడాకుల కేసు మలుపు తీసుకుంది. మరో నెల రోజుల్లో ఆమె కోర్టుకు హాజరు అవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు కనిపించడం లేదు.

33
సంగీత ఎక్కడ..?

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత నుంచి సంగీత ఆచూకీ తెలియడం లేదు. ఆమె ఎక్కడ ఉంది అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విజయ్ గెలుపుపై ఆమె ఒక్క చిన్న కామెంట్ కూడా చేయలేదు. దీంతో.. మళ్లీ విజయ్ తో రాజీ పడేందుకు ఆమె ప్రయత్నిస్తుందా? విడాకులు వెనక్కి తీసుకుంటుందా అనే సందేహాలు ఎక్కువగా మొదలయ్యాయి.

సంగీత బ్యాగ్రౌండ్...

సుమారు రూ.500 కోట్ల ఆస్తి కలిగిన సంగీత, శ్రీలంక తమిళ కుటుంబానికి చెందినది. లండన్‌లో పెరిగి అక్కడే నివసిస్తోంది. ప్రస్తుతం విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆమె లండన్‌లోనే కుటుంబ వ్యవహారాలు చూసుకుంటోంది. తమిళనాడులో విజయ్ సూపర్ స్టార్‌గా ఎదిగినా, సంగీత మాత్రం ఎక్కువగా ప్రజల ముందుకు రాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories