సాక్సులమ్మే చిన్నారికి ముఖ్యమంత్రి సాయం.. స్కూల్లో చేర్పించి, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ..

First Published May 8, 2021, 4:50 PM IST

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.
undefined
పదేళ్ల వయసున్న వన్ష్ సింగ్ అనే చిన్నారి లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సాక్సులు అమ్ముతుంటాడు. ఈ చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు ఆపేసి ఈ పనిలోకి దిగాడు. ఈ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
undefined
ఇది పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కంట పడింది. వెంటనే స్పందించిన ఆయన ఆ చిన్నారితో వీడియో కాల్ లో మాట్లాడారు. చదువుకోమని చెప్పారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూ. 2 లక్సల ఆర్థిక సాయాన్ని అందించారు.
undefined
వన్షు సింగ్ రెండో తరగతి చదువుతూ మధ్యలో ఆపేశాడు. అతన్ని తిరిగి చేర్చాలని డిసిని ఆదేశించారు. ఈ మేరకు అమరీందర్ సింగ్ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
undefined
ఈ వీడియోలో సాక్స్ అమ్ముతున్న చిన్నారిని మీద జాలితో కారులోని వ్యక్తి డబ్బులు ఇస్తుంటే ఆ చిన్నారి తిరస్కరించడం కనిపిస్తుంది. అది గమనించిన ఓ వ్యక్తి బాలుడితో మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసినట్టుగా ఉంది.
undefined
ఆ బాలుడితో కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడిన వీడియో కూడా ఇందులో ఉంది. అతని కుటుంబం, ఇతర ఖర్చులను తాను చూసుకుంటానని కెప్టెన్ బాలుడికి హామీ ఇచ్చారు. అతన్ని చదువుమీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు.
undefined
బాబుతో మాట్లాడుతూ "బాధపడొద్దు, నువ్వు పాఠశాలకు తిరిగి వెళ్లేలా డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలిస్తాను, మీ కుటుంబానికి సహాయం చేస్తాను" అని మిస్టర్ సింగ్ పంజాబీలో వన్ష్‌తో మాట్లాడారు.ఈ వీడియో మీద చాలా మంది ట్విట్టర్ యూజర్లు బాలుడి నిజాయితీని, డబ్బు తీసుకోకపోవడం ద్వారా అతని గౌరవాన్ని కాపాడుకోవాలనే సంకల్పాన్ని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఈ చర్యను ప్రజలు ప్రశంసించారు.
undefined
ఇలాంటి చర్యలు అమరీందర్ సింగ్‌ను "నిజమైన సిఎం" గా మారుస్తాయని ప్రశాంత్ దహిభేట్ అనే ట్విట్టర్ యూజర్ అన్నారు. బాలుడి కుటుంబానికి స్థిరమైన జీవనోపాధి కల్పించాలని మరొక యూజర్ ముఖ్యమంత్రిని కోరారు.
undefined
మరో యూజర్ అమన్ ఎస్ ఉప్పల్ మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి మంచి చొరవ అని.. పంజాబ్‌లోని ఏ పిల్లవాడూ పాఠశాలనుంచి డ్రాపవుట్ అవ్వకుండా తన ప్రభుత్వం చూడాలని అన్నారు.
undefined
click me!