తమిళనాడు ఎలక్షన్స్ 2021 : కమల్ మానియా పనిచేస్తోందా? ఆ సీటులో గెలుపెవరిది?...

First Published May 2, 2021, 9:23 AM IST

దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఇవ్వాళ ప్రారంభమయ్యింది. అయితే తమిళనాడులో ఓ సీటు మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ సీటు. ఈ నియోజక వర్గం నుంచి సినీ నటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ బరిలో నిలబడే ఇందుకు కారణం. 

undefined
బీజేపీ నుంచి వనాతి శ్రీనివాసన్, కాంగ్రెస్ తరపున మయూరా జయకుమార్ పోటీలో నిలిచారు. 2008లో డీలిమిటేషన్ జరిగిన అనంతరం ఈ సీటులో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు పర్యాయాలు ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఈసారి ఏఐడీఎంకే-బీజేపీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ సీటు బిజెపి చేతుల్లోకి వెళ్లింది.

ఈ సీటును ఏఐడీఎంకే కంచుకోటగా చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ కోయంబత్తూర్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మయూరా జయకుమార్‌ రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న అభ్యర్థుల్లో కమల్ హాసన్ ఒకరు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి, లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయించారు కమల్.
undefined
అయితే అప్పట్లో కమల్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో కమల్ కీలకంగా మారారు. కమల్ హాసన్ కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో అది మూడు, నాలుగు శాతం ఓటు గా మారింది.
undefined
కోయంబత్తూర్ జిల్లాలోని కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో రెండు లక్షల 52 వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఇక్కడ ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కోయంబత్తూర్ సౌత్ సీట్లు బిజెపికి కేటాయించింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రంగంలోకి వనతి శ్రీనివాసన్​ దిగారు. వరుసగా రెండో సారి ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
undefined
2016 లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె 33,113 ఓట్లు దక్కించుకుని మూడో స్థానంలో నిలిచారు. కాగా కోయంబత్తూర్ సౌత్ స్థానానికి అన్నాడీఎంకే సభ్యుడు అమ్మన్ అర్జునన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కి కాకుండా బిజెపికి ఈ స్థానాన్ని కేటాయించడంపై అమ్మన్ మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. చర్చల అనంతరం వీరు శాంతించారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు అమ్మన్ మద్దతుదారులు కమల్ హాసన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపించాయి.
undefined
డీఎంకే కాంగ్రెస్ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూరా జయకుమార్ పూపోటీకి దిగారు. కోయంబ‌త్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగడం ఆయనకు ఇది రెండోసారి .అన్నాడీఎంకే మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై ఓటర్లు సంతృప్తితో లేరని, ప్రజావ్యతిరేక పథకాలను కేంద్రం ప్రవేశపెడుతుందని జయకుమార్ ఆరోపిస్తున్నారు.
undefined
ఇదే సమయంలో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, సీమన్ నామ్ తమిళార్ కట్చి త‌దిత‌ర‌ పార్టీలు.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఓట్లను చీల్చుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది కమల్ హాసన్ కు కలిసి వచ్చే అంశం అని కూడా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కొద్ది గంటల్లో కోయంబత్తూరు సౌత్ ఎవరిదో తేలిపోతుంది.
undefined
click me!