Vande Bharat: కిలో మీట‌ర్‌కు రూ. 2 మాత్ర‌మే.. వందే భార‌త్ ఏసీ టికెట్ ధ‌ర‌పై కేంద్ర మంత్రి

Published : Feb 13, 2026, 01:51 PM IST

Vande Bharat: దేశంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు వేగం, సౌకర్యం అందిస్తున్నాయి. తాజాగా ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్ టికెట్ ధరపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వివరాలు వెల్లడించారు.  

PREV
15
కిలోమీటరుకు రూ.2.19 మాత్రమే

వందే భారత్ రైల్లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర కిలోమీటరుకు సుమారు రూ.2.19 మాత్రమే అని మంత్రి తెలిపారు. 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి కూడా ఇదే సగటు ధర వర్తిస్తుందని చెప్పారు. ఈ స్థాయి సౌకర్యాలు కలిగిన రైలుకు ఇది తక్కువ ధరగా భావిస్తున్నారు.

25
జపాన్, చైనా కంటే తక్కువే

జపాన్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హైస్పీడ్ రైళ్ల టికెట్ ధర కిలోమీటరుకు రూ.2 నుంచి రూ.20 వరకు ఉంటుందని మంత్రి చెప్పారు. వాటితో పోలిస్తే భారత్‌లో వందే భారత్ ఏసీ చైర్ కార్ టికెట్ ధర చాలా తక్కువగా ఉందని వివరించారు. అందుకే ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న హైస్పీడ్ సేవగా నిలుస్తోంది.

35
సాధారణ రైళ్ల టికెట్లు కూడా చవకే

వందే భారత్ మాత్రమే కాదు, దేశంలోని సాధారణ రైళ్ల టికెట్ ధర కూడా తక్కువగానే ఉందని మంత్రి తెలిపారు. భారత్‌లో సాధారణ రైల్లో కిలోమీటరుకు సగటు 20 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్‌లో ఇది సుమారు 54 పైసలు, బంగ్లాదేశ్‌లో 37 పైసలు, శ్రీలంకలో 51 పైసల వరకు ఉంటుందని వివరించారు. ఈ పోలికలతో భారత రైల్వే ధరలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు.

45
దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు

ప్రస్తుతం దేశంలో 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి 84 మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. దశలవారీగా మరిన్ని మార్గాలకు ఈ సేవలను విస్తరించే ప్రణాళిక ఉందని తెలిపారు. 2019లో ప్రారంభమైన వందే భారత్ సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి.

55
స్లీపర్ వందే భారత్ కూడా సిద్ధం

ఇటీవల వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా రాత్రి ప్రయాణాలు కూడా సౌకర్యవంతంగా మారనున్నాయి. వేగం, సౌకర్యం, తక్కువ ధర.. ఈ మూడు లక్ష్యాలతో భారత రైల్వే వందే భారత్ సేవలను విస్తరిస్తోంది. మొత్తంగా చూస్తే, వందే భారత్ ఏసీ టికెట్ ధర ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉందని కేంద్ర రైల్వే మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు. వేగవంతమైన రైలు సేవలను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories