బద్రీనాథ్ ధామ్ ప్రముఖ పుణ్యక్షేత్రంగానే మనకు తెలుసు. కానీ అక్కడ మనకు తెలియని కొన్ని రహస్యాలు కూడా దాగున్నాయి. ఈ ఆలయ ప్రాంతంలో కుక్కలు మొరగవు. మెరుపులు మెరుస్తాయి కానీ ఉరుములు శబ్దం చేయవు. ఎందుకో తెలుసుకోండి.
పవిత్ర దేవాలయాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ నర, నారాయణులు కలిసే యాత్రా స్థలం. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.
26
బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొలువై ఉంది. ఇక్కడ విష్ణువును పూజిస్తారు. ఇది అత్యంత పురాతన దేవాలయం.
36
బద్రీనాథ్ సందర్శనకు ఉత్తమ సమయం వేసవి కాలం. మే, నవంబర్ మధ్య వెళ్లవచ్చు. చలికాలంలో ఒక్కోసారి మంచుతో కప్పబడి ఉంటుంది.
46
ఆ దేవదేవుడి మహిమో, అత్యంత రహస్యమో.. బద్రీనాథ్‌లో కుక్కలు మొరగవు, ఉరుములు శబ్దం చేయవు, మేఘాలు గర్జించవు.
56
శ్రీ హరి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు కాబట్టే ప్రకృతి అలా సహకరిస్తుంది. ఇది ఆ దేవదేవుడి మహిమే అని భక్తులు చెబుతుంటారు. అందుకే ఉరుములు, కుక్కలు నిశ్శబ్దంగా ఉంటాయి.
66
విష్ణువు శాపం వల్ల కుక్కలు మొరగవట. మరో నమ్మకం ప్రకారం కుక్కలు దేవుని సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటంతో మొరగవని చెబుతుంటారు.