viral Kerala workplace harassment video: కేరళలోని కలూర్‌లో ఉన్న ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ ఉద్యోగుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నదనీ, దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారిని వీడియోలో సదరు కంపెనీలో తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగి మెడకు గోలుకు కట్టి కుక్కలా పాకించారు. ఉద్యోగి మోకాళ్లపై పాకుతూ నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయమని ఆదేశించించడం కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై కేరళ కార్మికశాఖ మంత్రి వి.శివన్ కుట్టి విచారణకు దేశించారు. పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత కార్యాలయంలో వేధింపులు కాదని, సంస్థను కించపరచడానికి ఉద్దేశించిన ప్రయత్నంగా సదరు సంస్థ పేర్కొంది.
కేరళ సర్కారు కార్మిక శాఖ అధికారులు పెరుంబవూర్‌లోని కెల్ట్రాగా గుర్తించబడిన కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రాథమిక విచారణలో కూడా జరిగింది. కార్యాలయంలో వేధింపులు కాదని, కంపెనీలోని ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత విభేదాలతో ఇది జరిగిందని గుర్తించారు.
అలాగే, ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదనీ, సుమారు ఆరు నెలల క్రితం మాజీ మేనేజర్ మనాఫ్ రికార్డ్ చేసినట్టు గుర్తించారు. అయితే, ఇప్పుడు అతను అక్కడ పనిచేయడం లేదు. అతనే ఇది చేశారని చెబుతూ.. సంస్థను పరువు తీయడానికి మనాఫ్ ఇప్పుడు వాటిని లీక్ చేశాడని ఆ సంస్థ పేర్కొంది.
ఈ ఘటన జరిగిన తర్వాత విచారణ జరిపి మనాఫ్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. మనాఫ్‌కు ఉబైల్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ వీడియోను లీక్ చేశాడని తెలిపింది. పోలీసులు దీనిపై విచారణ మరింత లోతుగా జరుపుతున్నారు. అలాగే, కేరళ హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.
కేరళ ఉద్యోగి వేధింపుల వీడయో ఇక్కడ చూడండి