తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పాఠశాలలు బంద్..

First Published | Nov 8, 2021, 11:57 AM IST

ఉత్తర కోస్తా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Chennai floods

చెన్నై: చెన్నై, దాని పరిసర ప్రాంతాలైన నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజులు ఈ ప్రాంతాల్లోని పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు అత్యవసర సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సహాయ చర్యల కోసం National Disaster Response Forceను  రప్పించింది.

దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడున్నాయి.. 

ఉత్తర కోస్తా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. heavy rains కారణంగా సోమవారం చాలా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు సెలవు ప్రకటించాలని లేదా ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.

Latest Videos


chennai flood

ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు చెన్నైలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం అంతటా ఉత్తర కోస్తా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. మంగళ, బుధవారాల్లో మరోసారి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Chennai Rains

చెన్నై చుట్టుపక్కల సరస్సులు పొంగిపొర్లడంతో చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. 85.4 అడుగుల ఎత్తున్న Chembarambakkam lakeలో ఇప్పుడు 82.35 అడుగుల వరకు నీరు ఉంది. 2015లో కురిసిన భారీ వర్షాల కారణంగా చెంబరంబాక్కం సరస్సులో నీరు అధికంగా చేరడంతో, ఒకేసారి అకస్మాత్తుగా అధిక నీటి విడుదల కారణంగా చెన్నైలో వరదలకు కారణం అయ్యింది.

Chennai Rains

ఇలా క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉండదని, అయితే అధిక వర్షం కురిస్తే ముదుచూర్ పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అడయార్ నది ఒడ్డున ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో flood alertలు జారీ చేశారు. తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి M K Stalin జిల్లా కలెక్టర్లతో preparednessపై చర్చించారు.  ఎగ్మోర్, పాడి బ్రిడ్జ్, Padi Bridge జవహర్ నగర్ సహా నీటి ఎద్దడి ఎదుర్కుంటున్న 14 ప్రాంతాలను సందర్శించారు.

తాను ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మాట్లాడానని, సహాయక చర్యల్లో కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Tamilnadu Rains

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సహాయక చర్యలలో సహాయం చేయడానికి నాలుగు బృందాలను మోహరించింది.
భారీ వర్షం కారణంగా రోడ్డు, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యమైనప్పటికీ, విమాన సర్వీసుల్లో పెద్దగా అంతరాయం కలగలేదని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

click me!