Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?

Published : Apr 16, 2026, 04:23 PM ISTUpdated : Apr 16, 2026, 04:34 PM IST

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. భారతదేశంలో మహిళలు ఎక్కువగా ఆల్కహాల్ సేవించే టాప్ 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ఇది. ఈ గణాంకాలు, వాటి వెనుక ఉన్న కారణాలను ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
18
మహిళలు ఎక్కువగా మందు తాగే టాప్ 7 రాష్ట్రాలు

ఈ రోజుల్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా.. మందు పార్టీలు లేకుండా ఏదీ జరగడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మగవారికి పోటీగా మగువలు కూడా ఆల్కహాల్ సేవించడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. దేశంలో మహిళలు ఎక్కువగా మందు తాగే టాప్ 7 రాష్ట్రాలు ఏవో చూద్దాం.

28
1. అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్‌లో 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 26% మంది ఆల్కహాల్ సేవిస్తున్నారట. మహిళలు మందు తాగడం ఇక్కడివారి సంస్కృతిలో ఒక భాగం. అతిథులకు "అపోంగ్" (బియ్యంతో చేసే బీర్), ఓపో, మధువా వంటి సంప్రదాయ పానీయాలను అందిస్తారు. పండుగలు, సంప్రదాయ వేడుకలు, సామాజిక కార్యక్రమాల్లో ఇవి తప్పనిసరి. అందుకే ఈ రాష్ట్రం మహిళలు ఆల్కహాల్ తాగే విషయంలో మొదటి స్థానంలో ఉంది.

38
తెలంగాణ

ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పండుగలు, వేడుకలు, పార్టీల సమయంలో పురుషులతో పాటు మహిళలకు కూడా ఆల్కహాల్ సేవించడం సర్వసాధారణం. ఈ దక్షిణ భారత రాష్ట్రంలో 6.7% మంది మహిళలు ఆల్కహాల్ సేవిస్తున్నారని కుటుంబ సర్వే తేల్చింది. 

తెలంగాణలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళలే ఎక్కువగా మందు తాగుతున్నారని సర్వే చెబుతోంది. తెలంగాణ గ్రామాల్లో మహిళలు కల్లు ఎక్కువగా తాగుతుంటారు. రోజంతా వ్యవసాయ పనులు చేసి అలసిపోయే మహిళలే ఎక్కువగా ఆల్కహాల్ సేవించి అలసట నుండి ఉపశమనం పొందుతారు. అందుకే మందుతాగే మహిళల శాతం తెలంగాణలో ఎక్కువగా ఉంది. 

48
సిక్కిం

సిక్కిం రాష్ట్రంలో 16.2% మంది మహిళలు ఆల్కహాల్ సేవిస్తున్నారట… దీంతో ఈ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మతపరమైన కార్యక్రమాలు, పండుగలు వంటి సందర్భాల్లో ఇక్కడ మందు వాడకం సర్వసాధారణం. ఆడ, మగ అనే తేడా లేకుండా ఆల్కహాల్ సేవించడం ఇక్కడ సామాజికంగా ఆమోదం పొందిన అలవాటుగా కొనసాగుతోంది.

58
అస్సాం

అస్సాంలో 7.3% మంది మహిళలు మందు తాగుతారు. మిగతా ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే, అస్సాంలోని గిరిజన తెగల్లో మందు తయారుచేయడం, సేవించడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. వారికి మందు తాగడం ఒక జీవన విధానం, అలాగే ఒక ఆచారం కూడా.

68
జార్ఖండ్

జార్ఖండ్‌లో 6.1% మంది మహిళలు ఆల్కహాల్ సేవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఏళ్లుగా వివక్షకు గురవుతున్న గిరిజన వర్గాలకు చెందినవారే. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఈ వర్గాల్లోని చాలామంది తమ కష్టాలను మరిచిపోవడానికి మందుకు అలవాటు పడుతున్నారు.

78
అండమాన్ ఆండ్ నికోబార్ దీవులు

మహిళలు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే జాబితాలో ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్, నికోబార్ దీవులు. ఇక్కడ 5% మంది మహిళలు మందు తాగుతారు. సామాజిక ఆచారాలు, ఒత్తిడి, మహిళలు చిన్న వయసులోనే తాగడం ప్రారంభించడం వంటివి ఈ సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.

88
ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 5% మంది మహిళలు మత్తు పానియాలు సేవిస్తున్నారు. దీంతో ఈ రాష్ట్రం జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఒత్తిడి, మహిళలకు అవకాశాలు లేకపోవడం ఈ సంఖ్యకు ప్రధాన కారణాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్కహాల్ సేవించడం ఒక సాధారణ అలవాటు. ఇక్కడి ఆచారాల ప్రకారం, పండుగలు, వేడుకల్లో సంప్రదాయబద్ధంగా ఆల్కహాల్ తయారుచేస్తారు.  

Read more Photos on
click me!

Recommended Stories