ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు రేపు కూడా సెలవే

First Published | Dec 3, 2024, 9:08 PM IST

ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా, విల్లుపురం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడా సెలవులు కొనసాగుతున్నాయి. 

తమిళనాడు వర్షాలు

ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత తగ్గినా పలు జిల్లాలో వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు కొనసాగుతున్నాయి. 

విల్లపురం, తిరువణ్ణామలై, ధర్మపురి, కృష్ణగిరి, కల్లకురిచి, కడలూరు, పుదుచ్చేరి జిల్లాల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. పలు జిల్లాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. 

కేవలం ఒకే రోజులో కృష్ణగిరి, మైలాపూర్ వంటి ప్రాంతాల్లో 50 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 20 ఏళ్ల తర్వాత 49 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నారు. చెరువులు, జలాశయాలు, నీటికుంటలు వరదనీటితో నిండుకుండల్లా మారాయి.

నీటి ప్రవాహాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని... ఏమాత్రం వరద నీరు కాలనీల్లోకి చేరినా వుంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

పాఠశాలలకు సెలవు

వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా పాఠశాలలు, కళాశాలలకు కొనసాగుతున్న సెలవులు పొడిగించారు. అంటే రేపు కూడా వర్షతీవ్రత ఎక్కువగా వున్న జిల్లాల్లో సెలవులు కొనసాగనున్నాయి.  


అన్బిల్ మహేష్

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి స్పందించారు. ఫెంగల్ తుఫాను వల్ల ప్రభావితమైన విల్లపురం, కడలూరు, కల్లకురిచి, తిరువణ్ణామలై, కృష్ణగిరి, సేలం, ధర్మపురి, తిరుపత్తూరు, చిత్తూరు, రాణిపేట్, వేలూరు, నీలగిరి జిల్లాల ప్రధాన విద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆయా జిల్లాల్లోని పాఠశాలల పరిస్థితి, తీసుకున్న భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. 

పాఠశాలలకు సెలవు

ఈ క్రమంలోనే విల్లపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ జిల్లాలో రేపు అంటే బుధవారం కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాలని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ పళని సెలవు ప్రకటించారు.  

పుదుచ్చేరి పాఠశాలలు

పుదుచ్చేరిలో వరదల కారణంగా సహాయ శిబిరాలుగా మార్చబడిన ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే రేపు సెలవు ప్రకటించారు. మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. 

కడలూరు పాఠశాలలు

కడలూరులో సహాయక చర్యలు కొనసాగుతున్నందున పణ్రుట్టి, అన్నాగ్రామం, కడలూరు పంచాయతీ యూనియన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే రేపు సెలవు ప్రకటించారు. 

Latest Videos

click me!