Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు

Published : Mar 22, 2026, 07:47 AM IST

Kumbh Mela Monalisa: కుంభమేళాతో ఫేమస్ అయిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లయిన వారం తరువాత ఇప్పుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మోనాలిసా ఏడుస్తోంది.

PREV
14
లవ్ జిహాద్ కాదు

ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఉండేది మోనాలిసా. ఆమె కళ్లు అందంగా ఉండడంతో ఒక యూట్యూబర్ ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు. అవి వైరల్ అయిపోయాయి. ఆమె తన కళ్లతోనే మోనాలిసా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం  ఓ ముస్లిం యువకుడిని ప్రేమించి కేరళ వచ్చి పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లాడిన వ్యక్తి పేరు ఫర్మాన్ ఖాన్. అతను కూడా నటుడే.  వీరిద్దరి పెళ్లిని 'లవ్ జిహాద్' అని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మోనాలిసా మాత్రం ఇది లవ్ జిహాద్ కాదని తానే  అతడిని ప్రేమించానని, పెళ్లి చేసుకోమని బలవంతం చేశానని చెప్పింది. ఈ పెళ్లిలలో తన భర్త తప్పేమీ లేదని మోనాలిసా స్పష్టం చేసింది.

24
మతం మార్చను

ఇక మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ కూడా తాను మోనాలిసాను మతం మార్చనని చెప్పాడు. ఇద్దరం తమ తమ మతాలనే అనుసరిస్తామని చెప్పాడు. అంతేకాదు ఆమెను పూర్తిగా హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లాడాడు. మోనాలిసాను ప్రేమించానని, అయితే వెంటనే పెళ్లి చేసుకోమని ఆమె పట్టుబట్టడంతో వివాహం చేసుకోవాల్సిన వచ్చిందని ఆయన చెప్పాడు.

34
చంపేస్తామంటున్నారు కాపాడండి

వీరిద్దరి పెళ్లి జరిగి వారం రోజులు దాటింది. ఇప్పుడు మళ్లీ ఈ జంట లైవ్ లోకి వచ్చింది.  తాము చాలా ప్రమాదంలో ఉన్నామని చెబుతోంది. తమను కాపాడాలంటూ మోనాలిసా ఏడుస్తూ వేడుకుంది. సోషల్ మీడియాలో, ఫోన్ కాల్స్‌లో చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని  తమకు రక్షణ కావాలని కోరింది.  ఈ విషయాన్ని పోలీసులు, మీడియాకు కూడా చెప్పామని తెలిపింది.  దయచేసి తమను రక్షించాలని కన్నీటితో వేడుకుంది.

మరో పక్క మోనాలిసా తండ్రి జై సింగ్ భోస్లే కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన వేరే కథను వినిపించారు. తన కూతురికి బ్రెయిన్‌వాష్ చేసి పెళ్లి చేశారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం వరకు ఆమె తమతో  బాగానే ఉందని, తాము చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటామని చెప్పిందని, ఇప్పుడు ఉన్నట్టుండి పెళ్లి నిర్ణయం తీసుకోవడం అనుమానంగా ఉందని ఆయన చెప్పారు. తన కూతురు తనకు కావాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

44
నా కూతురు ఇలా చేస్తుందనుకోలేదు

'నా కూతురు నన్నే ఎదిరించింది. మేమే ఏదో చేస్తామని చెప్పి మాపైనే పోలీసులకు కంప్లయింట్ చేసింది.  రక్షణ కోరింది. ఆమెను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. ఆమె వెనుక ఏదో జరుగుతుంది.  నాకైతే ఏదీ సరిగ్గా అనిపించడం లేదు. నా కూతురు నాకు తిరిగి కావాలి' అంటూ ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోనాలిసా తల్లి గతంలో తన కూతురు వయసు కేవలం 17 ఏళ్లేనని చెప్పింది. కానీ ఆధారాల ప్రకారం ఆమె వయసు 20 ఏళ్లుగా తేలింది. 

Read more Photos on
click me!

Recommended Stories