ram mandir ayodhya 2024
దేవుడి పూజలో నైవేద్యం కీలకం. పూజ చేయడం ఒక్కటే సరిపోదు.. తృణమో, ఫణమో నైవేద్యంగా సమర్పించినప్పుడే ఆ పూజా ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు.
అయోధ్యలో బాలరాముడికి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి? దీనివల్ల ధన,వస్తు లాభంతో పాటు.. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఆ ప్రసదాలు ఏంటి? అని ఒకసారి గమనిస్తే...
మీ జాతకంలో గురుగ్రహదోషాలుంటే జనవరి 22న శ్రీరాముడికి కేసరి ఖీర్ ను ప్రసాదంగా పెట్టండి. దీనివల్ల గురుగ్రహదోష నివారణతో పాటు ధనలాభమూ కలుగుతుందట.
మోహన్ భోగ్ ను శ్రీరాముడికి అర్పిస్తే వైవాహిక జీవితంలోని చింతలు తీరతాయట. ఇదొకరకమైన తీపిపదార్థం. ఇది శ్రీరాముడికి చాలాఇష్టమైన ప్రసాదంగా చెబుతారు.
శీతాకాలంలో నువ్వులు, బెల్లం నైవేద్యం దేవతలకు చాలా ఇష్టమని చెబుతారు. అందుకే నువ్వులు, బెల్లంలతో చేసిన నువ్వులలడ్డూలను ప్రసాదంగా సమర్పిస్తుంటారు. నువ్వులను ప్రసాదంగా పెట్టడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. సమస్యలు తీరతాయి.
మంగళదోష నివారణకోసం శ్రీరాముడికి ఎరుపురంగు పండ్లు, లేదా తీపి పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించాలి. దీనివల్ల మీలోని కోపం కూడా తగ్గుతుంది. వైవాహిక జీవితం కూడా సుఖవంతం అవుతుంది.
జీవితంలో సుఖశాంతులు, శాంతి, ధనలాభం కావాలంటే శ్రీరాముడికి నారికేళం సమర్పించాలట. కొబ్బరికాయ కొడతాం కదా.. అనుకుంటున్నారా? అలా కాదు.. రాముడికి సమర్పించే కొబ్బరికాయను కొట్టకూడదు. పూర్తి కాయను అలాగే రాముడికి ప్రసాదంగా సమర్పించాలి.