అందరికీ ఒకే విడాకుల విధానం ఉండాలి.. సుప్రీంకోర్టుకు క్రికెటర్ మహ్మద్ షమీ భార్య అభ్యర్థన...

Published : May 16, 2023, 09:50 AM IST

క్రికెటర్ మహ్మద్ షమీ భార్య ముస్లిం లా ప్రకారం తనకు భర్త విడాకులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ.. మత, లింగ బేధం లేని.. ఏకరూప విడాకుల విధానం ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

PREV
112
అందరికీ ఒకే విడాకుల విధానం ఉండాలి.. సుప్రీంకోర్టుకు క్రికెటర్ మహ్మద్ షమీ భార్య అభ్యర్థన...

న్యూఢిల్లీ : 'లింగ-తటస్థ.. మతం-తటస్థమైన విడాకుల విధానం.. అందరికీ ఒకే విధమైన విడాకుల విధానం" కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ క్రికెటర్ మహ్మద్ షమీ భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై సంబంధిత ప్రతివాదులకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

212

జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. దీనికి ఇలాంటి సమస్యలనే తెలుపుతూ దాఖలైన మరిన్ని పిటిషన్లను కూడా జత చేసింది. 

312

న్యాయవాది దీపక్ ప్రకాష్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తలాక్-ఉల్-హసన్ అనే అదనపు జ్యుడీషియల్ తలాక్ ఏకపక్షంగా ఉందని.. దీనివల్ల తన క్లయింట్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. 

412

మొహమ్మద్ షమీ జారీ చేసిన తలాక్-ఉల్-హసన్ కింద జులై 23, 2022 తేదీన విడాకుల మొదటి నోటీసు పిటిషనర్ భర్తనుంచి అందిందని పిటిషనర్ తెలిపారు. ఆ నోటీసును స్వీకరించిన తర్వాత, పిటిషనర్ ఆమె తన బంధుమిత్రులను సంప్రదించారు. వారుకూడా తాము ఇలాంటి ఏకపక్ష విడాకుల విధానం వల్ల  మనోవేదనను గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 

512

అందువల్ల, ముస్లిం వ్యక్తిగత చట్టాల (షరియత్) ప్రకారం ఇప్పటికీ ఎక్కువగా అమలులో ఉన్న "తలాక్-ఇ-హసన్ ఇతర అన్ని రకాల ఏకపక్ష అదనపు-న్యాయ తలాక్"కి సంబంధించిన సమస్యలపై, ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937పై తీర్పును కోరుతూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. 

612

ఈ తలాక్ విధానం వల్ల బాధితురాలై భార్యను అని పిటిషనర్ తెలిపారు. ముస్లిం వ్యక్తిగత చట్టాల (షరియత్) ప్రకారం అనుసరిస్తున్న క్రూరమైన పద్ధతులు దుర్వినియోగానికి గురైందని, ఇందులో తలాక్-ఇ బిద్దత్ మినహా, తలాక్ అని పిలువబడే అనేక ఇతర ఏకపక్ష విడాకులు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. 

712

ఈ చట్టాలు ముస్లిం పురుషునికి అనియంత్రిత అధికారాలను అందజేస్తుంది, ఒక ముస్లిం స్త్రీకి ఇష్టానుసారంగా విడాకులు ఇవ్వడానికి, సయోధ్యకు ఎలాంటి హక్కు లేకుండా లేదా ఏ విధంగానూ ఆమె వాదన వినబడకుండా విడాకులు మంజూరు చేస్తుంది. ముస్లిం స్త్రీలపై  లింగ ప్రాతిపదికన వివక్ష చూపడం, తద్వారా భారత రాజ్యాంగం, 1950లో ఆర్టికల్ 14,15, 21 కింద హామీ ఇవ్వబడిన మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని పిటిషనర్ తెలిపారు.

812

తలాక్-ఇ-హసన్ దీన్నే  తలాక్-ఉల్-హసన్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ తలాక్ విధానాన్ని ముస్లిం పురుషులు తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకమైన తలాక్ ద్వారా, ముస్లిం వ్యక్తి ఏకపక్షంగా అదనపు న్యాయపరమైన హక్కును కలిగి ఉంటాడు. 

912

తలాక్ మూడు ప్రకటనలు, వరుసగా మూడు నెలల వ్యవధిలో చేసే అధికారం ఉంటుంది. అలా చెప్పడం పూర్తైతే.. ముస్లిం మహిళల వాదన  వినకుండానే వివాహం రద్దు చేయబడుతుంది అని పిటిషన్ లో పేర్కొన్నారు.

1012

వీటిని దృష్టిలో పెట్టుకునే.. పిటిషనర్ "లింగ-తటస్థ, మత-తటస్త ఏకరీతి విడాకుల విధానాన్ని..అందరికీ విడాకుల ఏకరీతి విధానం" అమలయ్యేలా మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది. ఆర్టికల్ 14, 15, 21, 25  ఏకపక్షంగా, అహేతుకంగా ఉల్లంఘించినందుకు "తలాక్-ఇ-హసన్, ఇతర అన్ని రకాల ఏకపక్ష అదనపు న్యాయపరమైన తలాక్"  రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోరారు.

1112

ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937లోని సెక్షన్ 2 చెల్లదని, ఆర్టికల్ 14, 15, 21, 25లను ఉల్లంఘించినందుకు తలాక్ ఇ-హసన్  తర రకాల ఏకపక్ష అదనపు న్యాయ తలాక్ లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కూడా పిటిషన్ కోరింది".

1212

ముస్లిం మహిళలకు "తలాక్-ఇ-హసన్ నుండి రక్షణ కల్పించడంలో విఫలమైనందున, ఆర్టికల్ 14, 15, 21, 25లను ఉల్లంఘించినందుకు ముస్లిం వివాహాల రద్దు చట్టం, 1939 రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కూడా పిటిషన్ కోరింది. వీటితో పాటు ఇతర రకాల ఏకపక్ష అదనపు న్యాయ తలాక్ లను రద్దు చేయాలని కోరింది".

click me!

Recommended Stories