కర్ణాటక కొత్త సీఎం ఎవరనే విషయం ఇంకా తేలలేదు. సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిని ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆహ్వానం పంపింది. సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్లారు. డీకే శివకుమార్ మాత్రం ఢిల్లీకి వెళ్లలేదు. తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 135 ఎమ్మెల్యేలు గెలిచారన్నారు. తాను ఒంటరినని ఆయన చెప్పారు. సీఎం పదవి విషయంలో పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.