Thalapathy Vijay: తమిళ హీరో దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్. ఆయన క్రిస్టియన్. కానీ అతని భార్య, తల్లి మాత్రం హిందువులు. ఆయన హిందూ దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది.
దళపతి విజయ్ క్రిస్టియన్. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. అలాగని ఒకే మతానికి చెందిన దేవుడిని కాదు. అన్ని మతాలకు చెందిన దేవుళ్లను నమ్ముతానని చెబుతున్నారు. గతంలో ఒక సందర్భంలో "నేను దేవుడిని నమ్ముతాను. చర్చికి, గుడికి, దర్గాకు కూడా వెళ్తాను. అన్నిచోట్లా నాకు దైవ భావన కలుగుతుంది. మా అమ్మ హిందువు, నాన్న క్రిస్టియన్. వాళ్లది ప్రేమ వివాహం. ఫలానా చోటుకు వెళ్లొద్దని ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. నేను కూడా నా పిల్లలకు అలా చెప్పను" అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పారు. అప్పుడే అతనికి ఉన్న విశాల భావాల గురించి తెలుస్తోంది.
24
తల్లి కోసం సాయిబాబా గుడి
విజయ్ తల్లికి సాయిబాబా అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పుడూ సాయిబాబానే పూజిస్తుంది. అందుకే ఆయన తన తల్లి కోసం ఓ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. చాలా నిరాడంబరంగా ఆ గుడిని ప్రారంభించారు. అన్నట్టు విజయ్ ను పెళ్లి చేసుకున్న సంగీత స్వర్ఱలింగం కూడా హిందువునే.
34
తండ్రికి 80వ ఏట శాంతి పూజ
హిందూ సంప్రదాయం ప్రకారం 60 నుంచి 80 ఏళ్లు నిండినప్పుడు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదే విధంగా విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌కు 80 ఏళ్లు నిండినప్పుడు తిరుకడైయూర్ అమృతేశ్వర ఆలయంలో శాంతి పూజలు చేయించారు. అతను క్రిస్టియన్ అయినా కూడా అన్ని హిందూ దేవాలయాలకు వెళతారు. ఎక్కడా వారింట్లో మతాల గురించి చర్చ రాదు.
విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓసారి మాట్లాడుతూ తమ ఇంట్లో పెద్ద పూజ గది ఉందని చెప్పారు. తాను కూడా అన్ని మతాలను నమ్ముతానని చెబుతారు. విజయ్, సంగీత పెళ్లి కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే చేసుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో మాత్రం పెళ్లి చేసుకోలేదు అని విజయ్ తండ్రి అన్నారు.