సిద్ధరామయ్యకే కాంగ్రెస్ మొగ్గు.. ఎందుకో చెబుతున్న పది పాయింట్లు..

Published : May 17, 2023, 01:48 PM ISTUpdated : May 17, 2023, 01:50 PM IST

కర్నాటక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే కాంగ్రెస్ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అవకాశాలపై ప్రభావం చూపడం ఖాయం. 

PREV
111
సిద్ధరామయ్యకే కాంగ్రెస్ మొగ్గు.. ఎందుకో చెబుతున్న పది పాయింట్లు..

న్యూఢిల్లీ  : ఎట్టకేలకూ కర్ణాటక పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్టుగానే ఉంది. సిద్ధరామయ్యకే అధిష్టానం మొగ్గు చూపింది. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్రనేతలు బుధవారం సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లను కలిశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పది పాయింట్లు ఇవి.. 

211

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిన్న సాయంత్రం ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.అయితే వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఉన్న సిద్ధరామయ్య అంటే రాహుల్ గాంధీకి ప్రత్యేక అభిమానం అని. ఈ కారణంగానే ఆయన పుట్టినరోజు వేడుకలకు కూడా ప్రత్యేకంగా రాహుల్ ప్రత్యేకంగా హాజరయ్యారని పార్టీవర్గాల్లో వినిపిస్తున్న మాట. 

311

ముఖ్యమంత్రిగా 75 ఏళ్ల సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడానికి కాంగ్రెస్ మొగ్గుచూపుతోందని సమాచారం. ఎందుకంటే ఆయనకు చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఇప్పుడు కర్తవ్యం డీకే శివకుమార్ (61)ని ఎలా కలిసి పనిచేసేలా చేయడం అనే నిర్ణయం  తీసుకోవడమేనని వర్గాలు అంటున్నాయి. 

411
DK Shivakumar

ఖర్గేతో జరిగిన సమావేశంలో, సిద్ధరామయ్యతో ప్రతిష్టంభనలో తాను వెనక్కి తగ్గబోనని శివకుమార్ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

511

ముఖ్యమంతి రేసులో తానే ముందున్నాడనే ఊహాగానాల మధ్య సిద్ధరామయ్య సోమవారం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. దీనిమీద అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందని అడగ్గా.. వెయిట్ అండ్ సీ.. అంటూ.. తనకు తెలీదు అంటూ చెప్పుకొచ్చారు సిద్ధ రామయ్య. 

611

తానాశించిన పదవి ఇవ్వకపోయినా.. తిరుగుబాటు చేయనని శివకుమార్ తెలిపారు. ‘‘పార్టీకి కావాలనుకుంటే నాకు బాధ్యత ఇస్తుంది... మాది సమైక్య సభ.. ఎవరినీ విభజించడం నాకు ఇష్టం లేదు.. వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నేను బాధ్యతగల మనిషిని.. వెన్నుపోటు పొడవను. బ్లాక్‌మెయిల్ చేయను’’ అని ఆయన అన్నారు.

711

కర్ణాటకకు వచ్చిన పరిశీలకుల బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి.. పార్టీ నాయకత్వానికి తెలియజేసింది. వీరి నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అవకాశాలపై ప్రభావం చూపడం ఖాయమని తెలుస్తోంది. 

811

సిద్ధరామయ్య మాస్ అప్పీల్ ఉన్న నాయకుడిగా, 2018లో పూర్తి కాలాన్ని పూర్తి చేసిన నాయకుడు కాగా, డీకే శివకుమార్ ఆర్గనైజింగ్ సామర్థ్యం గల వ్యక్తి. కష్ట సమయాల్లో వనరులు సమకూర్చి కాంగ్రెస్ లో ట్రబుల్షూటర్‌గా పరిగణించబడ్డారు. ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేసినా మరొకరు పార్టీకి దూరం కావచ్చు, అతని మద్దతుదారులతో సమస్యలు ఏర్పడచ్చు. 

911

డి.కె.శివకుమార్ విషయంలో రాజకీయంగా కీలకమైన వొక్కలింగలు అతని వెనక ఉండగా.. సిద్ధరామయ్య విషయానికొస్తే, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉండడం, అహిండా వేదిక.. కాంగ్రెస్‌కు మూకుమ్మడిగా ఓటు వేసిన మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితుల సామాజిక కలయిక ఉంది. 

1011

మరోవైపు రాజకీయంగా కీలకమైన లింగాయత్ సామాజికవర్గం ముఖ్యమంత్రి పదవిపై కన్నేసింది. లింగాయత్ సంస్థ ఆల్ ఇండియా వీరశైవ మహాసభ ఖర్గేకు రాసిన లేఖలో కాంగ్రెస్ పోటీ చేసిన 46 మంది లింగాయత్ నాయకులలో 34 మంది గెలిచారని గుర్తు చేశారు.

1111

224 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించి 135 సీట్లతో గెలిచింది. గత వారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందునుంచే కాంగ్రెస్ గెలుస్తుందని రాజకీయ వ్యాఖ్యాతలు అంచనాలు వేశారు. 

click me!

Recommended Stories