దీనిమీద ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. తమకొచ్చిన వీడియోలు, ఫొటోల ఆధారంగా విచారణ కొనసాగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కట్ని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిజిత్ కుమార్ రంజన్ మాట్లాడుతూ, "ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది, ఈ సంఘటన జిల్లాలోని స్లీమనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రాథమిక విచారణలో, ఈ సంఘటన జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె ప్రేమికుడు, ఆమె భర్త మధ్య గొడవ కారణంగా ఇలా జరిగిందని తేలింది. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు" అన్నారు.