ఆ స్త్రీల కష్టం పగోడికి కూడా రావద్దు.. ఏజ్ బార్ అవుతున్నా కానీ పెళ్లిళ్లు.. పుట్టింట్లోనే 50వేలమంది...

First Published Apr 29, 2021, 4:55 PM IST

ఇదో విచిత్ర సమస్య.. దేశంలో ఓ వైపు బాల్య వివాహాలు జరుగుతుంటే.. మరోవైపు వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువతుల సంఖ్య పెరిగిపోతుండడం విచిత్రం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. వందలు కాదు వీరి సంఖ్య వేలు దాటిపోతుండడం ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ ఒక్క చోటే దాదాపు 50వేలమంది యువతులు ముప్పైయేళ్లు దాటినా వివాహాలకు నోచుకోక పుట్టింట్లోనే ఉండిపోతున్నారు. 

undefined
చాలా మంది అమ్మాయిలకు పాతికేళ్ల లోపే పెళ్లి జరిగి పోతుంది. చదువు, ఉన్నతోద్యోగం కారణాల వల్ల మాత్రం అతి కొద్ది శాతం యువతులు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. అయినప్పటికీ 30 ఏళ్ల వయసు మీద పడేసరికి వివాహబంధంలో కుదురుకుంటున్నారు. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వయసు మీద పడి 30 ఏళ్లు దాటినా పెళ్లి లో కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉంటున్నారు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటి అబ్బాయిలకు ఈ సమస్య రావాలి కానీ అమ్మాయిలకు రావడమేమిటి అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా?
undefined
కాశ్మీర్ లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు కాక అవివాహితులుగా మిగిలిపోతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 50 వేల మంది స్త్రీలు కాశ్మీర్లో పెళ్ళిళ్ళు కాకుండా పుట్టింట్లోనే ఉండిపోయారు. ఒక్క శ్రీ నగర్ జిల్లాలోనే పదివేల మంది మహిళలు ఉండిపోయారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.
undefined
తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇలా పెళ్లిళ్లు జరగకుండా ఉండిపోవడానికి ఆర్థిక కారణాలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే అని సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ రషీద్ నాయక్ చెబుతున్నారు.

‘మా పక్కింటి వాడు తన కూతురిని మంచి ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చేశాడు. నేను కూడా అంతకుమించిన సంబంధం తెచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలి’..అని భావించి ఆలస్యం చేస్తూ వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.
undefined
ఇలా ఏళ్లు గడుస్తున్నా వయసు మీద పడి పోయి అసలు పెళ్లి కాకుండా యువతులు ఉండి పోతున్నారని ఆయన వాపోతున్నారు. ఈతరం కుర్రాళ్ళ లో అత్యధిక శాతం మంది చదువుకున్న అమ్మాయిలు, ఏదో ఒక ఉద్యోగం చేసే యువతులను మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైందంటున్నారు.

చదువు లేకుంటే అధిక కట్నాలు అడుగుతున్నారని.. అంత మొత్తంలో ఇచ్చుకోలేక కూడా పెళ్ళిళ్ళు జరగడం లేదని తేలిందంటున్నారు. ఏదేమైనా సమాజంలో వస్తున్న మార్పుల వల్ల పెళ్లిళ్లు కాకుండా పుట్టింట్లోనే కాలం గడుపుతున్న యువతుల సంఖ్య ఈ రేంజ్ లో పెరుగుతుండడం శోచనీయమని వాపోయారు.
undefined
click me!