హ్యాట్సాఫ్ సోనూసూద్.. దేశవ్యాప్తంగా ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుతో మరో ముందడుగు.. !

First Published May 11, 2021, 3:40 PM IST

మనిషి తలుచుకుంటే ఏదైనా చేయచ్చు.. ఎంతటి కష్టమైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా మహమ్మారి నేపథ్యంలో వలసకూలీలను స్వంత ప్రాంతాలకు బస్సుల్లో పంపించడంతో మొదలైన ఆయన సేవాతత్పరత ఇప్పుడు మరో ముందుడుగు వేసింది. 

మనిషి తలుచుకుంటే ఏదైనా చేయచ్చు.. ఎంతటి కష్టమైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా మహమ్మారి నేపథ్యంలో వలసకూలీలను స్వంత ప్రాంతాలకు బస్సుల్లో పంపించడంతో మొదలైన ఆయన సేవాతత్పరత ఇప్పుడు మరో ముందుడుగు వేసింది.
undefined
ఏకంగా ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి.. దేశంలో ఆక్సీజన్ కొరత తీర్చాలని నడుంబిగించారు సోనూసూద్. ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని స్వయంగా తన భుజానికెత్తుకున్నారాయన.
undefined
కరోనా కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నానంటూ దేశ ప్రజలకు దైర్యాన్నిచ్చారు రియల్ హీరో సోనూసూద్. ఆ సమయంలో దేశంలో ఏ మూల, ఎవరికీ, ఎలాంటి సహాయం కావాలన్నా సామాజిక మాధ్యమాల వేదిక తెలియజేస్తే చాలు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారు.
undefined
ఇప్పటికే ఎందరో కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సోనూ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్న వారిని చూసి చలించిన సోనూసూద్ ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్ లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు.
undefined
ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారాయన. ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.
undefined
తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో పది రోజుల్లో ఇండియాకు రానుంది. ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాంతో ఇప్పటికే కొన్ని చోట్ల సిలిండర్లు ఏర్పాటుచేశాం.
undefined
అయితే ఆక్సిజన్ ప్లాంట్ల వల్లనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. సమయమే మనకు అతి పెద్ద సవాలు. ప్రతిదీ సమయానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నామని.. సోనుసూద్ తెలిపారు.
undefined
click me!