డబుల్ మాస్క్ : కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ.. ఎలా ధరించాలంటే..

First Published May 11, 2021, 10:43 AM IST

వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండడం కోసం డబుల్ మాస్క్ లను ధరించాలని సూచనలు చేశారు. 

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే.. ఆ ముప్పును రానివ్వకూడదంటే మాస్కు ధరించడం తప్పనిసరి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
undefined
అయితే ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండడం కోసం డబుల్ మాస్క్ లను ధరించాలని సూచనలు చేశారు.
undefined
నిపుణుల ప్రకారం.. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంత మేరకు వైరస్ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చని తేలింది. కాగా తాజాగా డబుల్ మాస్క్ వాడకం మీద కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
undefined
ఒకే రకమైన రెండు మాస్కులను డబులు మాస్క్ గా వాడొద్దని కేంద్ర స్పష్టం చేసింది. డబుల్ మాస్క్ ను ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని కేంద్రం సూచించింది.
undefined
అంతేకాకుండా ఒకే మాస్క్ ను వరుసగా రెండ్రోజుల పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది.
undefined
సాధారణ క్లాత్ మాస్క్ 42-46శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్క్ అయితే 56.4 శాతం రక్షన ఇస్తుందన్నారు.
undefined
సర్జికల్ మాస్కు మీద క్లాత్ మాస్క్ ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు.
undefined
click me!