Sologamy Marriage : క్షమాబిందు పెళ్లి అయిపోయిందోచ్.. ముహూర్తానికి రెండు రోజుల ముందుగానే..

Published : Jun 09, 2022, 01:23 PM IST

తనను తానే పెళ్లి చేసుకుంటానని ప్రకటించి సంచలనంగా మారిన క్షమాబిందు పెళ్లి అయిపోయింది. జూన్ 11న పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ఆమె.. రెండు రోజుల ముందుగానే ఈ రోజు పెళ్లి చేసేసుకుంది.

PREV
16
Sologamy Marriage : క్షమాబిందు పెళ్లి అయిపోయిందోచ్.. ముహూర్తానికి రెండు రోజుల ముందుగానే..
Kshama Bindu

గుజరాత్ : ఆత్మీయుల సమక్షంలో.. బాజా భజంత్రీల నడుమ వేదమంత్రాల సాక్షిగా క్షమా బిందు ‘స్వీ వివాహం’ చేసుకుంది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్ని బాగానే ఉన్నాయి కానీ... ఒక్క వరుడే లేదు. ముందుగా అనుకున్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమ.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.  

26
Kshama Bindu

గుజరాత్లోని వడోదర కు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. దీని కోసం  మొదట గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం కూడా నిశ్చయమయింది. అయితే,  ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమ తీరును తప్పుపట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్ళికి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకుంది.

36
Kshama Bindu

ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమా బిందు. హల్ది, మెహందీ కార్యక్రమాలతోపాటు పెళ్లిలో వేదమంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. ఇక దేశంలోని తొలి స్వీయ వివాహం ఇదే.

46
Kshama Bindu

ఇంతకీ ఎవరీ క్షమా బిందు…
గుజరాత్లోని వడోదర కు చెందిన క్షమా బిందు…  సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ అధికారిగా పని చేస్తుంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉండగా, తల్లి అహ్మదాబాదులో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితి అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ... చివరికి ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. 

56
Kshama Bindu

ఈ నెల 11న జరగాల్సిన వింత పెళ్లికి గోత్రి ఆలయం జూన్ 4న అభ్యంతరం చెప్పింది.  వడోదర శివారులోని గోత్రి ఆలయంలో వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయ పాలకమండలి అందుకు నిరాకరించింది. సమాజంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

66
Kshama Bindu

ఈ నెల 11న జరగాల్సిన వింత పెళ్లికి గోత్రి ఆలయం జూన్ 4న అభ్యంతరం చెప్పింది.  వడోదర శివారులోని గోత్రి ఆలయంలో వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయ పాలకమండలి అందుకు నిరాకరించింది. సమాజంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

click me!

Recommended Stories