Indian soldiers: ల‌డ‌ఖ్‌లో ఘోర ప్ర‌మాదం... ఏడుగురు భార‌త సైనికులు మృతి

First Published May 27, 2022, 6:09 PM IST

Indian Army: ల‌డ‌ఖ్ లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 

7 Indian soldiers killed in accident: సియాచిన్‌కు నైరుతి దిశలో లడఖ్‌లో 26 మంది భారతీయ ఆర్మీ సైనికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో కనీసం 7 మంది భార‌త సైనికులు మరణించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. శుక్రవారం నాడు సైనికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ష్యోక్ నదిలో పడిపోవడంతో ప్రాణాలు ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 19 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. 
 

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 26 మంది సైనికులు ఉన్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాయపడిన 19 మంది సైనికులను ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన  సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా హర్యానాలోని పంచకులలోని చండీమందిర్ కమాండ్ ఆసుపత్రికి తరలించినట్లు తాజా నివేదికలు తెలిపాయి.


ఈ దుర్ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన‌ సైనికులను తరలించడానికి భారత వైమానిక దళం నుండి వైమానిక సహాయాన్ని కోరినట్లు సోర్సెస్ ఇంతకు ముందు పేర్కొన్నాయి.  పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి తుర్తుక్ సెక్టార్‌లోని సబ్-సెక్టార్ హనీఫ్‌లోని ఫార్వర్డ్ లొకేషన్‌కు సైనికులు తరలిస్తున్నారని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
 

Image: Mangled remains of the ill-fated vehicle carrying Indian Army personnel can be seen next to the Shyok river in Ladakh

 ఉదయం 9 గంటలకు, థోయిస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో, బస్సు 50 నుండి 60 అడుగుల ష్యోక్ నదిలో పడిపోయింది. బస్సులో ఉన్న సైనికులందరికీ గాయాలయ్యాయి.

ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సైనికులందరినీ మొదట పార్తాపూర్‌లోని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర కాశ్మీర్‌లో ఉన్న సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి. ఏప్రిల్ 3, 1984 నుండి దాదాపు 20,000 అడుగుల ఎత్తులో భారత సైనికులు అక్కడ మోహరించారు.
 

click me!