ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ వర్షం కురియడంతో వాతావరణం విమాన సేవలకు ప్రతికూలంగా మారింది. ఫలితంగా ఫ్లైట్ టైమింగ్స్ మారిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్లూ ఈ విషయాన్ని వెల్లడించాయి. వర్షం, ఉరుములు, మెరుపుల, వడగండ్ల కారణంగా తమ విమాన సేవలకు అంతరాయం కలుగవచ్చని ఇండిగో ట్వీట్ చేసింది. కాబట్టి, ప్రయాణికులు కాస్త ఎక్కువ సమయాన్నే ఫ్లైట్ ట్రావెల్ కోసం కేటాయించుకోవాలని సూచించింది.