Sneha Dubey : పాక్ కు గట్టి షాక్ ఇచ్చిన... స్నేహా దూబే ఎవరంటే....

First Published Sep 25, 2021, 2:36 PM IST

జమ్మూ కాశ్మీర్- లఢఖ్ ఎప్పటికీ భారత్ వే అంటూ తేల్చి చెప్పారు స్నేహా దూబే. పాకిస్తాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా ఏకి పారేసారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను పాకిస్తాన్ చేస్తున్న వ్యవహారాలను చీల్చి చెండాడారు. దీంతో యూఎన్ఓ లో స్నేహ మాట్లాడిన తీరు తెలుసుకున్న వారంతా ఇప్పుడు అసలు ఎవరీ స్నేహా దూబే అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Sneha Dubey

ప్రధాని మోదీ మరి కొద్ది గంటల్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించబోతున్నారు. దీనికి ముందే అదే వేదిక మీద ఒక అరుదైన ఆకర్షణీయమైన ఘట్టం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇండియా ప్రతినిధిగా ఫస్ట్ సెక్రటరీగా స్నేహ దూబే తిప్పి కొట్టారు. 

Sneha Dubey

జమ్మూ కాశ్మీర్- లఢఖ్ ఎప్పటికీ భారత్ వే అంటూ తేల్చి చెప్పారు స్నేహా దూబే. పాకిస్తాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా ఏకి పారేసారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను పాకిస్తాన్ చేస్తున్న వ్యవహారాలను చీల్చి చెండాడారు. దీంతో యూఎన్ఓ లో స్నేహ మాట్లాడిన తీరు తెలుసుకున్న వారంతా ఇప్పుడు అసలు ఎవరీ స్నేహా దూబే అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Sneha Dubey

స్నేహా దూబే 2012 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. యూఎన్ లో ఇండియా తరపున ఫస్ట్ సెక్రటరీగా ఉన్న స్నేహా దూబే.. గోవాలో స్కూల్ విద్యను పూర్తి చేశారు. పూనేలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. 12 యేళ్ల వయసులోనే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 

Sneha Dubey

2011లో సివిల్ సర్వీసెస్ రాసిన మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాల గురించి నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఫారిన్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టినట్లు గతంలో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. కొత్త సంస్కృతులను తెలుసుకోవాలన్న థ్రిల్, కీలకమైన విధాన నిర్ణయాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపన తనలో ఉన్నట్లు స్నేహా దూబే అప్పట్లోనే వివరించారు. స్నేహకు ట్రావెలింగ్ అన్నా ఇష్టమే. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కావడం వల్ల తాను దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినట్లు ఆమె చెప్పారు. 

Sneha Dubey

తమ కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి వ్యక్తి స్నేహా దూబే. తండ్రి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక తల్లి స్కూల్ టీచర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫారిన్ సర్వీస్ కు ఎంపికైన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖలో తొలిసారిగా జాయిన్ అయ్యారు. 2014లో మాడ్రిడ్ లో ఉన్న ఎంబసీలో ఆమె తొలి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎన్ లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 

undefined

యూఎన్ లో స్నేహా దూబే మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వైఖరిని స్నేహ ఎండగట్టిన తీరు అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. పదునెక్కిన పదాలతో పొరుగు దేశాన్ని చీల్చిచెండాడిన తీరు సూపర్ అని పొగుడుతూ పోస్టింగులు పెడుతున్నారు. ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆమె ఎన్నుకున్న విషయం స్పష్టం అవుతోంది. నిజాలను నిర్భయంగా చెప్పిందంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. గతంలోనూ యూఎన్ లో ఇండియా తరఫున మహిళా ప్రతినిధులు ఇలాగే మాట్లాడారు. ఈనమ్ గంభీర్, విదిషా మైత్రా తరహాలోనే స్నేహ కూడా పాక్ భరతం పట్టిందని సోషల్ మీడియాలో ప్రశంసలు.. అనుకూల కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. 

click me!