మరో గ్రంథాలయ ఉద్యమం..! ప్రతిగ్రామంలో గ్రంథాలయం.. ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా

First Published Sep 23, 2021, 5:31 PM IST

సమాజంలోని రుగ్మతలు, జాఢ్యాలు రూపుమాపాలంటే అక్షరాస్యత సిసలైన ఆయుధం. సమాజ శ్రేయస్సుకు గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే బిహార్‌లోని పుర్నియా జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 52.09 శాతం అక్షరాస్యత ఉన్న ఆ జిల్లాలో పురోగతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

library

చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని గురజాడ చెప్పిన మాటను బిహార్‌లోని
పుర్నియా జిల్లా కలెక్టర్ కచ్చితంగా పాటిస్తున్నారు. వట్టికోట అళ్వారు స్వామి గ్రంథాలయోద్యమానికి పాటుపడ్డట్టే
పుర్నియా జిల్లాలో ప్రతి గ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 52.09 శాతం అక్షరాస్యత ఉన్న ఆ జిల్లా
ఇప్పుడు పుస్తకాల పురుగులకు స్వర్గదామంగా నిలుస్తున్నది. దీంతో పట్టణ, గ్రామీణంలో యువత, విద్యార్థులు
గ్రంథాలయాల బాటపడుతున్నారు. పుస్తకాలు, పేపర్లు, కాంపిటీటివ్ పుస్తకాల్లోకి తలలు దూరుస్తున్నారు.

బీహార్ సీమాంచల్ రీజియన్‌లోని పుర్నియా జిల్లాలో అక్షరాస్యత 52.09 శాతం ఉన్నది. ఈ దుస్థితిని మార్చడానికి
జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ కంకణం కట్టుకున్నారు. జిల్లాలోని ప్రతిగ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.230 గ్రామపంచాయతీల్లో, ఏడు నగర పరిషత్‌లలో లైబ్రరీలను ఏర్పాటు చేశారు.

library

ప్రతిగ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనేదానికి ముందు కలెక్టర్ కితాబ్ దాన్(పుస్తకాలను విరాళాలుగా ఇచ్చే) క్యాంపెయిన్ నిర్వహించారు. జనవరి కితాబ్ దాన్ క్యాంపెయిన్ చేపట్టి సుమారు 1.26 లక్షల పుస్తకాలను సేకరించారు.

library in high range

అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారులు, స్థానికుల సహకారంతో కితాబ్ దాన్, గ్రంథాలయాల ఏర్పాటు చేసే పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెలువడ్డాయి.

Library Council

కలెక్టర్ రాహుల్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుందని రాష్ట్ర విద్యా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశంసించారు.

library

ఇదే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించడంపై యోచన చేస్తున్నదని వివరించారు. పొరుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమంపై దృష్టి పెడుతున్నాయి.

transgender library

చరిత్ర పొడుగునా గ్రంథాలయాలకున్న ప్రాధాన్యత పలుసార్లు వెలికి వచ్చింది. అవి మానవ జీవిత సారాన్ని నిక్షిప్తం చేయడమే కాదు, భవిష్యత్‌కు మార్గనిర్దేశనం చేస్తాయి.

click me!