ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శిక్షక్ పర్వ్ 2021 వేడుకలు జరుగుతున్నాయి. నూతన విద్యా విధానం 2020 కింద తీసుకున్న నూతన సంస్కరణలు, కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే చర్చించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. మహమ్మారి కాలంలో బోధన, విద్యార్జనలో టీచర్లు, విద్యార్థులు, ఇతరుల పాత్రలపై సంభాషించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యారంగానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. విద్య అనేది సంఘటితంగా ఉండాలని, అంతేకాదు, అందరికీ సమానంగా అందాలని తెలిపారు.
గత ఏడేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యలో నాణ్యతను పెంచడానికి చేసిన కృషిని వెల్లడించే కొన్ని వివరాలను మీ ముందుంచుతున్నాం.