దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది.
దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లలో సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది.
25
త్వరలోనే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రోజున వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొన్ని అద్భుతమైన నమూనా చిత్రాలను విడుదల చేశారు.
35
ఇక, ఈ ఏడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందేభారత్ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని.. 2024 మార్చి నాటికి రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.
45
ఇక, అశ్విని వైష్ణవ్ విడుదల చేసిన చిత్రాలు పరిశీలిస్తే, స్లీపర్ ఎడిషన్ వందేభారత్ రైళ్లు.. అత్యాధునిక ఇంటీరియర్, సౌకర్యాలతో ప్రయాణీకులకు మరింత మెరుగైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించే విధంగా ఉన్నాయి.
55
Vande Bharath Sleeper
ఈ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసిన అశ్విని వైష్ణవ్.. “కాన్సెప్ట్ రైలు - వందే భారత్ (స్లీపర్ వెర్షన్). త్వరలో… 2024 ప్రారంభంలో” అని పేర్కొన్నారు. ఇక, వందే భారత్ స్లీపర్ రైళ్లు.. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనున్నాయి.