
School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ ఆగస్ట్ లో భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక వేడుకలు, జాతీయ పర్వదినాల సందర్భంగా సెలవులున్నాయి... ఆసక్తికరంగా ఇవి వీకెండ్ తో కలిసిరావడంతో వరుస సెలవులుగా మారుతున్నాయి. ఇలా గత మూడ్రోజులుగా సెలవులు కొనసాగుతున్నాయి... ఆగస్ట్ 8 రెండో శనివారం, 9 ఆదివారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెలవుంటే ఆగస్ట్ 10న బోనాల తర్వాతరోజు తెలంగాణవ్యాప్తంగా సెలవుంది. ఇలా ఏపీలో 2, తెలంగాణలో 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి.
అయితే ఈ వీకెండ్ తో సెలవుల పరంపర ముగియలేదు... వచ్చే వీకెండ్ కూడా ఇలాగే వరుసగా రెండ్రోజులు హాలిడేస్ కలిసి వస్తున్నాయి... దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరి గంతేసే పరిస్థితి. ఆగస్ట్ 15, 16 రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో సెలవులున్నాయి... ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం.
ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం... ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత విద్యార్థులకు సెలవే. కొన్ని స్కూళ్లలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి... అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతారు... ఎలాంటి తరగతులు ఉండవు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారిక సెలవు ఉంటుంది.
అయితే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం వీకెండ్ సెలవుతో కలిసి వస్తోంది... కాబట్టి మరోసారి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ 15 శనివారం ఇండిపెండెంట్ డే, ఆగస్ట్ 16 ఆదివారం సాధారణ సెలవు... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా రెండ్రోజుల సెలవులున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.
కేవలం విద్యార్థులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవానికి లేకున్నా ప్రతి శని, ఆదివారం సెలవే. ఇలా విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవే... కాబట్టి కుటుంబమంతా హాయిగా గడపవచ్చు.
వీకెండ్ హాలిడేస్ కంటే ముందే మణిపూర్ లో మరో ప్రత్యేక సెలవు ఉంది. ఆగస్ట్ 13న ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పేట్రియాట్స్ డే సందర్భంగా సెలవుంది. ఆంగ్లో-మణిపురి యుద్దంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళిగా దేశభక్తుల ఈ దినోత్సవం (పేట్రియాట్స్ డే) నిర్వహిస్తారు. అందుకే ఆ రాష్ట్రంలో ఆగస్ట్ 13న (గురువారం) విద్యాసంస్ధలు, ఉద్యోగులకు అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
అంటే మణిపూర్ విద్యార్థులు, ఉద్యోగులకు ఆగస్ట్ 13, 15, 16 మూడ్రోజులు సెలవే... మధ్యలో ఆగస్ట్ 14 (శుక్రవారం) కవర్ చేసి లీవ్ తీసుకుంటే వరుసగా నాల్రోజులు సెలవే. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం కేవలం శని, ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఎలా చూసినా దేశవ్యాప్తంగా రెండ్రోజులు లాంగ్ వీకెండ్ ఉంటుందన్నమాట.
ఇప్పటికే ఆగస్ట్ 10 రోజులు మిగిశాయి... ఇందులో నాలుగైదు రోజులు సెలవులే వచ్చాయి. ఇక మిగిలిన 20 రోజుల్లోనూ మరికొన్ని సెలవులు వస్తున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
ఆగస్ట్ 15 (శనివారం) - స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు. పారసీ న్యూఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఐచ్చిక సెలవుంది.
ఆగస్ట్ 16 (ఆదివారం) - సాధారణ సెలవు
ఆగస్ట్ 21 (శుక్రవారం) - వరలక్ష్మి వ్రతం (ఐచ్చిక సెలవు)
ఆగస్ట్ 23 (ఆదివారం) - సాధారణ సెలవు
ఆగస్ట్ 26 (బుధవారం) - ఈద్ మిలాదున్ నబి సెలవు
ఆగస్ట్ 28 (శుక్రవారం) - శ్రావణ పూర్ణిమ, రాఖీ పౌర్షమి
ఆగస్ట్ 30 (ఆదివారం) - సాధారణ సెలవు
ఇలా ఆదివారాలు, పండగలు కలిపి మొత్తం ఆరురోజులు సెలవులున్నాయి. ఇక ఆగస్ట్ లో భారీ వర్షాలు కురిస్తే ఆ సెలవులు అదనం. ఇలా ఈ నెలలో ఊహించని సెలవులు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో భారీగానే సెలవులు వచ్చాయి… ఇఖపై కూడా రాబోతున్నాయి.