కేరళ కళామండపంలో కథాకళిని నేర్చుకుంటున్న మొదటి ముస్లిం బాలిక సాబ్రి..

Published : Jun 17, 2023, 12:32 PM IST

కేరళలోని కళామండలంలో కథాకళి నేర్చుకుంటున్న మొదటి ముస్లిం బాలికగా ఓ చిన్నారి రికార్డ్ సృష్టించింది. కళారూపాన్ని నేర్చుకోవడానికి మతం అడ్డుకాదని నిరూపించింది. 

PREV
17
కేరళ కళామండపంలో కథాకళిని నేర్చుకుంటున్న మొదటి ముస్లిం బాలిక సాబ్రి..

త్రిసూర్ : కేరళ కళామండలంలో కథాకళి కోర్సులో చేరిన తొలి ముస్లిం బాలికగా గుర్తింపు పొందింది పద్నాలుగేళ్ల ఎన్. సాబ్రి. ఆమె కొల్లాంలోని ఆంచల్‌ నివాసి. ఆరేళ్ల వయసులోనే కథాకళి వేషధారణ, రంగులు, నటనకు ఆ చిన్నారి తీవ్రంగా ఆకర్షితురాలైంది.

27

సాబ్రి కథాకళి నేర్చుకున్న మొదటి ముస్లిం అమ్మాయి యేం కాదు. అంతకు ముందు వడక్కంచెరికి చెందిన జహ్నారా రెహమాన్ (దుబాయ్‌లో డాక్టర్) వంటి కళాకారులు ఉన్నారు. అయితే, వీరు ముందు ప్రైవేట్ సెంటర్‌లలో కథాకళి అభ్యసించారు. కానీ, 90 ఏళ్ల చరిత్ర ఉన్న కళామండలం కోర్సులో చేరిన మొదటి ముస్లిం అమ్మాయి మాత్రం సాబ్రినే. కళామండలం కథాకళికి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.

37

ప్రముఖ కథాకళి గాయకుడు దివంగత కళామండలం హైదరాలీ కథాకళిని ఒక మతపరమైన ప్రత్యేక కళారూపంగా పరిమితం చేయడానికి చేసే సంప్రదాయవాద ప్రయత్నాలను బద్దలు కొట్టారు. కళామండలం పాలక మండలి సభ్యుడు, ప్రముఖ కళాకారుడు కళామండలం గోపి మాట్లాడుతూ కథాకళి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. 

"మతం, కులం, భాష, జాతీయత వంటి అడ్డంకులను అధిగమించి ప్రజలను కలపడానికి కళకు అపారమైన సామర్థ్యం ఉంది" అని ఆయన చెప్పారు. సాబ్రి చేరిన కళామండలం కథాకళి (తెక్కన్ చిట్ట)కి హెడ్ గా ఉన్న రవికుమార్ అసన్, మాట్లాడుతూ.. సాబ్రి తన చదువును సంస్థలో కొనసాగించే అవకాశాన్ని పొందుతుందని చెప్పారు.

47

దీనిమీద సాబ్రి మాట్లాడుతూ.. నేను కథాకళి నేర్చుకోవడం ఆపను. ఈ విషయంలో నా మతం లేదా ఏదైనా మతపరమైన భావజాలం నా మీద ప్రభావం చూపబోదు అని చెప్పుకొచ్చింది. సాబ్రి తండ్రి, ఎస్ నిజాం మాట్లాడుతూ.. కథాకళి మొత్తం కేరళలోని అత్యంత అధునాతన దేశీయ కళారూపం అని,  దానిని ఒక మతంతో ప్రత్యేకంగా అనుబంధం అని చెప్పడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

57

నేను, నా కూతురు మా మత విశ్వాసాలను ఫాలో అవుతాం. అలా అని ఛాందసవాదులం కాదన్నారు. అయితే అది ఒక కళారూపాన్ని నేర్చుకోవడంవిషయంలో ఆమెను ప్రభావితం చేయదని చెప్పాడు. చాలా కథాకళి ప్రదర్శనలు హిందూ మతంతో ముడిపడి ఉన్న కథలపై ఆధారపడి ఉంటాయి. హిందూమతం బహుదేవతారాధన మతం. 

కానీ, వీరు ఏకేశ్వరోపాసనగా ఉన్న ఇస్లాంను అనుసరిస్తున్నందున అది అతనిపై, అతని కుమార్తెపై ఎలా ప్రభావం చూపుతుందని అడిగినప్పుడు, నిజాం ఇలా అన్నాడు : “మనం పురాణాలను గొప్ప సృజనాత్మక వ్యక్తీకరణలుగా గుర్తించాలి. కథకళి ఈ అద్భుతమైన కళారూపాన్ని నృత్య-నాటకపు మరొక మాధ్యమం ద్వారా సంగ్రహించడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి, కథాకళి అధ్యయనం చేయడానికి నా కుమార్తెకు ఎలాంటి అడ్డంకులు లేవు.

67

కళామండలంలో నేర్చుకునే సమయంలో సాబ్రీ హిజాబ్, ఇతర సాంప్రదాయ ఇస్లామిక్ దుస్తులను తొలగించడంలో ఎటువంటి సమస్య ఉండదని నిజాం చెప్పారు. "తప్పనిసరిగా ఒక సంస్థ నిబంధనలను అనుసరించాలి," అన్నారాయన.

77

నిజాం ఫొటోగ్రాఫర్. కథాకళి ప్రదర్శనలను ఫొటోలు తీయడానికి తనకు అసైన్‌మెంట్లు వచ్చేవని, ఆ ఫోటోషూట్‌ల కోసం అతనితో కలిసి కూతురు వచ్చేదని ఆ సమయంలో సాబ్రికి కథకళిపై ఆసక్తి మొదలైందని తెలిపారు. ఆమె అంచల్ సమీపంలోని చదయమంగళంలో కళామండలం ఆరోమల్ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ పొందింది. "కథాకళి నేర్చుకోవడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను కథాకళిని అధ్యయనం చేయగలనని నాకు తెలుసు" అని సాబ్రి చెప్పారు.

click me!

Recommended Stories