Reena Dwivedi New Look: అప్పుడు యెల్లో కలర్ చీరలో.. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్‌లో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Published : Feb 23, 2022, 10:38 AM ISTUpdated : Feb 23, 2022, 10:39 AM IST

మీకు రీనా ద్వివేది (Reena Dwivedi) గుర్తుందా.. ఈ పేరు ఎక్కడో విన్నట్టూ అనిపిస్తుంది కదా..! అయితే ఆ పేరు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె గురించి తెలుసుకోవాలంటే.. మీరు 2019 ఎన్నికల సమయంలో జరిగింది తెలుసుకోవాల్సిందే.   

PREV
16
Reena Dwivedi New Look: అప్పుడు యెల్లో కలర్ చీరలో.. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్‌లో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

2019లో జరిగిన సార్వత్రి ఎన్నికల సమయంలో పోలింగ్ అధికారిణిగా విధులు నిర్వర్తించిన రీనా ద్వివేది ఓవర్‌ నైట్‌లో పాపులర్ అయిపోయారు. యూపీలో పోలింగ్ ఆఫీసర్ విధులు నిర్వర్తించిన ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌‌తో ట్రెండింగ్‌లోకి వచ్చారు. సోషల్ మీడియాలో ఆమె గురించి తెగ చర్చ సాగింది. 

26


అయితే ఆమె అంత వైరల్‌గా మారడానికి కారణం.. రీనా ద్వివేదీ యెల్లో సారీ క‌ట్టుకొని, సన్‌ గ్లాసెస్ పెట్టుకుని ఈవీఎంల‌ను ప‌ట్టుకొని త‌ను పోలింగ్ స్టేష‌న్‌లోకి వెళ్లే స‌మ‌యంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

36

రీనా ద్వివేది ఫొటోలు వైరల్‌గా మారడంతో.. ఫుల్ ఫేమస్ అయిపోయారు. కొద్ది రోజుల పాటు ఆమె గురించి విపరీతమైన సోషల్ మీడియాలో చర్చ సాగింది. అయితే ఆమె గురించి మళ్లీ ఎందుకు చర్చ జరుగుతుందంటే.. యూపీలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలలో పోలింగ్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె..  ఈసారి స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చారు.
 

46

లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌కు Reena Dwivedi వస్తున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమెను గుర్తించిన కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
 

56

ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్పు గురించి అడిగినప్పుడు..“తోడా చేంజ్ హోనా చాహియే (కొంచెం మార్పు అవసరం)” అని చెప్పుకొచ్చింది. రీనా ద్వివేది గతంలో బిగ్‌బాస్‌ షోకు వెళ్లాలనే ఉందనే తన మనసులో భావాలను వ్యక్తం చేసింది. రీనా ద్వివేదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా తన ఫొటోలను షేర్ చేస్తుంటారు. 
 

66

ఇక, రీనా ద్వివేది విషయానికి వస్తే.. ఆమె పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ లక్నో కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఫ్యాషన్‌పై చాలా ఆసక్తి. డియోరియాకు చెందిన ఆమెకు చిన్నతనం నుంచి ఫిట్‌గా ఉండటం అంటే ఇష్టం. తాను ధరించే దస్తులపై ఆమె ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. అందంగా కనిపించేలా చూసుకుంటుంది.

click me!

Recommended Stories