హై హీల్స్ తో ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్.. టైటానిక్ లా మునిగిపోయిన పుట్టి...

First Published Nov 12, 2020, 4:23 PM IST

హై హీల్స్ వేసుకుని పుట్టీలో ప్రయాణించిన ఓ జంట పెళ్లికిముందే మృత్యువాత పడిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. 

హై హీల్స్ వేసుకుని పుట్టీలో ప్రయాణించిన ఓ జంట పెళ్లికిముందే మృత్యువాత పడిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది.
undefined
మైసూరు జిల్లా, యఖ్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28) శశికళ (20) దూరపు బంధువులు. వీరికి గత సంవత్సరం నవంబర్ 22న నిశ్చితార్థం జరిగింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడడంతో ఈ నెల 22న పెళ్లికి నిశ్చయించారు. ఈ లోగా ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం టీ నరసిపూర తాలూకా, ముడకుథూరుకు వెళ్లారు.
undefined
కావేరీ నదిలో పుట్టిలో ప్రయాణం ఇక్కడ పర్యాటక ఆకర్షణ. టైటానిక్ సినిమాలో లాగా ఫోటో తీయాలని ఈ జంట కోరారు. ఇందుకుగాను ఒడ్డునుంచి 20 మీటర్ల దూరంలో ఓ పుట్టిలో నిలబడ్డారు.
undefined
ఫొటో గ్రాఫర్, యువతి సోదరుడు ఒడ్డున నిలబడి ఉన్నారు. ఫోటో షూట్ టైంలో హై హీల్స్ వేసుకున్న శశికళ పట్టుతప్పి ఓవైపు ఒరిగిపోయింది. దీంతో పుట్టి అదుపుతప్పి బోల్తా పడింది.
undefined
పుట్టి నడుపుతున్న మూగప్పతో సహా ముగ్గురూ నీటిలో పడిపోయారు. నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ చంద్రు, శశికళ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు.
undefined
విషయం తెలిసిన తాలక్కాడ్ పోలీసులు గత ఈతగాళ్లతో వెతికించగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి.
undefined
తాలక్కాడ్ దేవాలయం దగ్గర ఫోటో షూట్ కు అనుమతి ఇవ్వకపోవడంతోనే వారు కావేరీ నది దగ్గరికి వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
undefined
పుట్టిలో ప్రయాణించేప్పుడు బాలెన్స్ సరిగా ఉండదని కాస్త అదుపుతప్పినా ప్రమాదనం అని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తప్పనిసరి లైఫ్ జాకెట్లను ధరించేలా నిబంధన పెట్టాలని నీటి పారుదల శాఖకు లేఖ రాస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
undefined
click me!